కొన్ని క్రేజీ కాంబినేషన్లు అనుకోకుండా కలుస్తాయి. అనుకోకుండా సినిమా అనౌన్స్ మెంట్లు వస్తాయి. కాని కొన్ని కాంబోలు రూమర్స్ కేపరిమితం అవుతాయి. తాజాగా మరో క్రేజీకాంబినేషన్ పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ కాంబో ఏంటంటే..?
ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ క్రేజీ కాంబినేషన్లు ఇండస్ట్రీలో సందడి చేస్తున్నాయి. మరికొన్ని కాంబినేషన్లపై వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో పుల్ బిజీబిజీగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే నాలుగైదు భారీబడ్జెట్ సినిమాలు లైన్ లో పెట్టిన ప్రభాస్.. వెంట వెంటనే సినిమాలు కమిట్ అవుతున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దే పనిలో ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
మరోవైపు ఖైదీ సినిమాతో బాక్సాఫీష్‌ను షేక్ చేశాడు లోకేశ్ కనగరాజ్. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్ సినిమాలతో రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్న లోకేశ్ కనగరాజ్ త్వరలోభారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. అది కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో. ప్రభాస్ -లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందన్న న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఫిల్మ్ నగర్ సర్కిల్ లో తెగ తిరిగేస్తోంది.
టాలీవుడ్ లో భారీ సినిమాలు తెరకెక్కిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈసినిమా రూపొందుతోన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా సెట్ చేశారట. సౌత్ ఇండియన్ యంగ్ . మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈమూవీకి సంగీతం అందించబోతున్నట్టు సమాచారం.
వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలర్ రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా నెక్ట్స్ ఇయర్ ప్రారంభంలో రిలీజ్ కాబోతోంది. ఇక మహానటి ఫేమ్ నాగ్ అశ్వీన్ కాంబోలో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఈరెండు సినిమాలకు సబంధించిన అప్ డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. ఇక ఈరెండు సినిమాలతో పాటు.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్.. మారుతీ డైరెక్షన్ లో.. రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.
