వరుసగా పార్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఒకదాని వెంట మరొక సినిమా అనౌన్స్ చేస్తూనే ఉన్నాడు యూనివర్సల్ స్టార్.
వరుసగా పార్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఒకదాని వెంట మరొక సినిమా అనౌన్స్ చేస్తూనే ఉన్నాడు యూనివర్సల్ స్టార్.
ప్రభాస్(Prabhas) ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందుగా ప్రభాస్ (Prabhas) నుంచి రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. రెండు మూడు రిలీజ్ డేట్లు మార్చుకుని ఫైనల్ గా సమ్మర్ కు చేరింది సినిమా. ఈ సినిమా తరువాత చేస్తున్న సినిమాలు కూడా ఆల్ మోస్ట్ షూటింగ్ ఎండింగ్ దశలో ఉన్నాయి.
బాలీవుడ్ లో ఆది పురుష్ షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.ఇక సలార్ అయితే షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా. ఈ ఏడాదిలోనే ఆడియన్స్ ను అలరించనుంది. ఇక ఆ తరువాత వరుసగా ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K పాన్ వరల్డ్ స్థాయిలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలను ఆయన లైన్లో పెట్టేశాడు.
అంతే కాదు ఈనేపథ్యంలోనే ప్రభాస్ మారుతికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ గట్టిగా నడుస్తుంది. ఈ వార్తలను మారుతి ఖండించకపోవడంతో ఈ సినిమా కన్ ఫార్మ్ అనుకున్నారు అంతా. ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీలను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకు ఇందులో ప్లేస్ ఉందట. అయితే శ్రీలీలా మెయిన్ హీరోయిన్ కాదని తెలుస్తోంది.
మరి మెయిన్ హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో తెలియాల్సి ఉంది. అందువలన ఆ ఇద్దరినీ కూడా సెట్ చేసే పనిలో మారుతి ఉన్నాడని సమాచారం. అంటే ప్రభాస్ (Prabhas) ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తాడన్నమాట. సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు.. హీరోయిన్లను కూడా ఒకే సారి అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
