Asianet News TeluguAsianet News Telugu

#Kalki నైజాం టోటల్ రన్ లో ఎంత షేర్ రావచ్చు,షాకింగ్ ఇన్ఫో

 ప్రభాస్‌, అమితాబ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

Prabhas #Kalki2898AD Nizam area total share jsp
Author
First Published Jul 9, 2024, 8:47 AM IST


 ప్రభాస్‌ (Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ మూవీ  రూ.900 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూలు (kalki 2898 ad collection worldwide) చేసినట్లు చిత్ర టీమ్ ఇప్పటికే ప్రకటించింది.ఒకట్రెండు రోజుల్లో    అరుదైన మైలురాయికి చేరుకోబోతోంది. ఇదే హవా కొనసాగితే రూ.1000 కోట్లు మార్కును అందుకోవడం జూజూబి. ఇక ఈ చిత్రం ఆంధ్రాలో కన్నా నైజాం లో ఎక్కువ కలెక్షన్స్ కనపడుతున్నాయి.

ఈ క్రమంలో నైజాంలో  టోటల్ రన్ లో ఎంత కలెక్ట్ చేయవచ్చు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు నైజాంలో  80 కోట్ల షేర్ దాటే అవకాశం వుందని తెలుస్తోంది. అందుకు కారణం  ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898ఏడీ కు నైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్స్ కన్నా మల్టిప్లెక్స్ లలో ఎక్కువ ఆదరణ లభించటమే.  12 రోజులు దాటినా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రేక్షకులు  బ్రహ్మరథం పడుతున్నారు.  

మరోవైపు హిందీ ప్రేక్షకులు ‘కల్కి’ మూవీకి ఫిదా అవుతున్నారు. ప్రభాస్‌, అమితాబ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో రూ.200 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిన మూవీగా ‘కల్కి’ నిలిచింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్ఆర్‌’ తర్వాత హిందీలో రూ.200 కోట్లు వసూలు చేసిన మూవీ ఇదే కావడం గమనార్హం. ఇక ప్రభాస్ సినిమాల పరంగా చూస్తే ఇదే రెండో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రం.

నార్త్‌ అమెరికాలో ఇప్పటివరకూ ఏ దక్షిణాది చిత్రమూ సాధించని అరుదైన ఫీట్‌ను కల్కి సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ 16 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడింగ్‌ వర్గాలు అంచనా వేశాయి. అంతేకాదు, బుక్‌ మై షోలో కోటికి పైగా టికెట్ల విక్రయమైన చిత్రంగానూ రికార్డు సృష్టించింది. అలాగే, హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో అతి తక్కువ సమయంలో రూ.3కోట్లు కలెక్ట్‌ చేసిన చిత్రంగా కల్కి నిలిచింది.

భైరవ పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అదరకొట్టే నటన, అంతకు మించి నాగ్ అశ్విన్ మేకింగ్ విజన్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. ఫస్ట్ వీకెండ్ అయ్యాక కలెక్షన్స్ డ్రాప్ అవుతాయేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే స్లో అయ్యింది. మిగతా చోట్ల స్ట్రాంగ్  గానే ఉంది.   తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ కి వస్తే నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది.  ఆంధ్ర, సీడెడ్ లలో డ్రాప్ కనిపిస్తోంది.    ఓవర్సీస్ లో అలాగే హిందీలో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపిస్తోంటే... మిగిలిన చోట్ల కొంచం డ్రాప్ కనపడుతోంది.  
  
 ప్రభాస్ మాట్లాడుతూ.. “కల్కి సినిమాలో నా పాత్ర చాలా గ్రే షేడ్స్‌తో ఉంటుంది. అలాగే, నేను సూపర్‌ హీరోగా కనిపిస్తాను, దానికి హ్యూమర్ టచ్ కూడా ఉంటుంది. కాకపోతే, తెలుగు ప్రేక్షకులు నన్ను ఇలాంటి పాత్రలో ఇంతకు ముందు చూశారు. కానీ ఇతర భాషల్లోని ప్రేక్షకులకు ఈ పాత్రలో నన్ను చూడటం కొత్తగా అనిపిస్తోంది. పైగా గ్రే షేడ్స్‌తో కూడిన ఫన్నీ క్యారెక్టర్‌లో నన్ను నేను చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. 

కాగా వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన  ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. కల్కి’లో  కమల్ హాసన్‌ విలన్‌గా కనిపించారు. సుప్రీం యాస్కిన్‌ పాత్రను ఆయన (Kamal Haasan) పోషించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు.  ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయసందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios