Asianet News TeluguAsianet News Telugu

#Kalki2898AD:ప్రభాస్ 'కల్కి' ఓవర్ సీస్ రైట్స్ అంత చెప్తున్నారా?

 ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు .. ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ పనులు వేగాన్ని పుంజుకున్నాయి. 

Prabhas Kalki 2898 AD Overseas Rights Quoted at 100 Cr? jsp
Author
First Published Feb 9, 2024, 8:49 AM IST | Last Updated Feb 9, 2024, 8:49 AM IST


ప్రభాస్ రీసెంట్ గా  స‌లార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. వరస  ప్రాజెక్టులతో బిజీగా ఉన్న  ప్రభాస్  కల్కి 2898 ఏడి ని రెడీ చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన గ్లింప్స్, వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.  ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా… కమల్ హసన్ విలన్‌గా నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో కల్కి మూవీని నిర్మిస్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ కు ఓ రేంజిలో క్రేజ్ ఏర్పడిందని తెలుస్తోంది. ప్రభాస్ 'కల్కి'  ఓవర్ సీస్ రైట్స్ ని 100 కోట్లు దాకా కోట్ చేసారు. అయితే  డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం  70Cr – 75 కోట్లు దాకా అడుగుతున్నారట. కానీ నిర్మాతలు మాత్రం 100Cr దగ్గరే ఉన్నారట. ఎవరూ ఆ రేటు కు తీసుకోకపోతే నిర్మాతలు తామే ఓవర్ సీస్ లో సొంత  రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆ రేంజి నమ్మకం తమ సినిమాపై ఉందిట. కానీ వంద కోట్లు పెట్టి రైట్స్  తీసుకుంటే రికవరీ ఎలా ఉంటుందనేది అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచనలో పడుతున్నారట. ఓవర్ సీస్ మార్కెట్ పెరిగిన మాట నిజమే కానీ వందకోట్లు దాటి లాభాలు వచ్చే సిట్యువేషన్ ఉందా అనేది క్వచ్చిన్ మార్క్ అంటున్నారు.  అయితే కేవలం ఓవర్ సీస్ మాత్రమే కాదట...ప్రతీ ఏరియాకి అదే స్దాయిలో రేట్లు చెప్తున్నారట. 

 ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు .. ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ పనులు వేగాన్ని పుంజుకున్నాయి. మరోవైపు కల్కి ప్రాజెక్ట్ గురించి నిత్యం.. సోషల్ మీడియాలో ఆసక్తిరక విషయాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  కల్కి తో పాటు రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ చిత్రాలు .. ప్రభాస్ కు క్యూలో ఉన్నాయి.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios