Asianet News TeluguAsianet News Telugu

Kalki 2898 Ad : ‘కల్కి 2898 ఏడీ’ సాంగ్ అప్డేట్.. ఎలా ప్లానింగ్ చేశారో తెలుసా?

మూడు నెలల్లో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా గురించి ఇంట్రెస్ట్ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. తాజాగా క్రేజీ న్యూస్ అందింది. 

Prabhas Kalki 2898 Ad Movie Update NSK
Author
First Published Feb 11, 2024, 10:31 PM IST | Last Updated Feb 11, 2024, 10:33 PM IST

Prabhas ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసే అప్డేట్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. సలార్ Salaar వంటి హిట్ తర్వాత ప్రభాస్ నుంచి  వస్తున్న పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’పైనే అందరి చూపు ఉంది. ఈ చిత్రంపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ Nag Ashwin డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే Deepika Padukone హీరోయిన్‌గా నటిస్తున్నది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ విలన్‌గా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి క్రేజీ అప్డేట్ అందింది. దిశా పటానీ - ప్రభాస్ తో త్వరలో ఫారేన్ లో షూటింగ్ జరగబోతోందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయాలనే ప్లాన్ లో టీమ్ ఉందని టాక్. యూరోప్ లో ఈ పాటను చిత్రీకరించేందుకు త్వరలో వెళ్లనున్నారని అంటున్నారు. 

ఇక ఈ చిత్ర క్లైమాక్స్ కూడా త్వరలో ఉంటుందన్నారు. క్లైమాక్స్ లో ఏకంగా... ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకోని, దిశా పటాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, ఇలా ఇంకా చాలా మంది స్టార్స్ కనపడబోతున్నారని ప్రచారం అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... కల్కి రెండు పార్ట్ లుగా రాబోతోంది. మొదటి పార్ట్ చివర్లో కమల్ ఎంట్రీ ఇస్తారు. కమల్ విశ్వరూపంతో క్లైమాక్స్ దద్దరిల్లిపోతుందంటున్నారు. సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే స్దాయిలో ఈ క్లైమాక్స్ ని డిజైన్ చేశారంట. మే 9న కల్కి 2898 ఏడీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios