ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. దాంతో అందరూ రాధేశ్యామ్ కంటిన్యూ లాంగ్ షెడ్యూల్ చేసి హాలీడే తీసుకున్నారని భావించారు. కానీ ముంబై టాబ్లెయిడ్స్ ప్రకారం ప్రభాస్ ప్రస్తుతం తన తాజా చిత్రం ఆదిపురుష్..ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు. అలాగే మరో ప్రక్క ప్రభాస్ పై లుక్ టస్ట్ జరుగుతోంది. ఈ మూవీ ప్రీ విజువలైజేషన్ గురించి ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్‌ తో మాట్లాడుతున్నార‌ట‌.మరో ప్రక్క విఎఫ్ ఎక్స్ సాయింతో షూట్ చేసే స్టంట్స్ కు సంభందించి రిహార్సల్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ గా చేసే ఫైట్ సీక్వెన్స్ లు వేరు. 

విఎప్ ఎక్స్ మిక్స్ చేసే ఫైట్స్ ..గ్రీన్ మ్యాట్ లో షూట్ చేస్తారు. ఎదర ఎవరూ లేకపోయినా ఉన్నట్లు ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని గ్రాఫిక్స్ లో మిక్స్ చేస్తారు. వీటిన్నటికి ప్రిపరేషన్ అవసరం. దానికి తోడు ఈ సినిమాని సాధ్యమైనంత తక్కువ సమయంలో, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేద్దామని ప్రభాస్ ఆలోచనగా చెప్తున్నారు. అదే సమయంలో ఈ సినిమా గ్రాఫిక్స్ బడ్జెట్ కూడా ఓ రేంజిలో ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 250 కోట్ల భారీ బడ్జెట్ ని గ్రాఫిక్స్ కోసం పెట్టనున్నారట. అంతా గ్రీన్ మ్యాట్ లోనే షూటింగ్ చేస్తారట. ఈ సినిమాలో ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్ తో నిండి ఉంటాయి. అవతార్ స్దాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని, లొకేషన్స్ అన్ని విజువల్ గ్రాఫిక్స్ అని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు వరకూ అవుతుందని, త్రీడిలో తీస్తున్న సినిమా,అదీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నది కావటంతో గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ లో ఎక్సపర్ట్ అని తెలుస్తోంది.