ప్రభాస్‌, గోపీచంద్‌ కలిసి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే2` షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సెకండ్‌ గ్లింప్స్ ని విడుదల చేశారు.

బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా రన్‌ అవుతున్న టాక్‌ షో `అన్‌స్టాపబుల్‌విత్‌ఎన్బీకే2`(Unstoppablewithnbk2)కి ఈ వారం ప్రభాస్‌(Prabhas), గోపీచంద్‌(Gopichand) గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇప్పుడు మరో గ్లింప్స్ ని రిలీజ్‌ చేశారు. గోపీచంద్‌ ఎంట్రీకి సంబంధించిన ఈ గ్లింప్స్ గురువారం సాయంత్రం విడుదల చేయగా, అది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నవ్వలు పూయిస్తుంది. ఇందులో గోపీచంద్‌, ప్రభాస్‌ మధ్య డైలాగులు, చివరగా బాలయ్య చెప్పిన డైలాగ్‌ నవ్వులు విరిసేలా చేశాయి. ఫన్నీగా సాగాయి. 

ఈ సెకండ్‌ గ్లింప్స్ లో ప్రభాస్‌ బోర్డ్ కి బాణం వేస్తుండగా, పక్కా కమర్షియలే అంటూ గోపీచంద్‌ ఎంట్రీ ఇచ్చారు. అటు బాలయ్యని, ఇటు ప్రభాస్‌ని హాగ్‌ చేసుకున్నాడు గోపీచంద్‌. 2008 కాదు సర్‌ అది.. అని గోపీచంద్‌ ఆలోచనలో పడగా.. అరేయ్‌ అంటూ ప్రభాస్‌ ఇచ్చిన రియాక్షన్‌ కామెడీని పంచుతుంది. ఇందులో గోపీచంద్‌ని కొట్టకుండా బాలకృష్ణ మధ్యలో అడ్డురాగా, ప్రభాస్ అటూ ఇటు చూడటం, ఆ తర్వాత గోపీచంద్‌ తల కిందకేసి ఏదో సైగ చేయడం మరింత ఆకట్టుకుంది. ఇక చివరగా అదీ ఒంగోలియన్స్ అంటే అని బాలకృష్ణ చివర్లో చెప్పడంతో షో మొత్తం నవ్వులతో హోరెత్తిపోయింది. 

Scroll to load tweet…

`అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే 2` షోలోనే బాహుబలి ఎపిసోడ్‌గా పిలవబడే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన రెండు గ్లింప్స్ లు నవ్వులు పూయించేలా సాగుతున్నాయి. బాలయ్య, ప్రభాస్‌, గోపీచంద్‌ మధ్య కన్వర్జేషన్‌ చాలా ఫన్నీగా సాగిందని అర్థమవుతుంది. ప్రోమోలో ఆ వినోదం మరింత రెట్టింపుగా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ ఎపిసోడ్‌ని డిసెంబర్‌ 30న టెలికాస్ట్ చేయబోతున్నారట. టాలీవుడ్‌లో ప్రభాస్‌, గోపీచంద్‌ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అందుకే ఈ ఇద్దరిని జంటగా పిలిచారు బాలయ్య. ఇద్దరు కలిసి `వర్షం` చిత్రంలో నటించారు. అందులో గోపీచంద్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు.