ప్రభాస్‌ తన పెద్ద మనసుని చాటుకున్నారు. తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌కి సర్‌ఫ్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. దీంతో అభిమాని ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మరి తన ట్రైనర్‌కి ప్రభాస్‌ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే షాక్‌ అవుతారు.  

స్టార్‌ హీరోస్‌.. తన వద్ద పనిచేసే వర్కర్లకి, ట్రైనర్లు, డ్రైవర్లకి ఏదో టైమ్‌లో సర్‌ప్రైజ్‌ ఇస్తుంటాడు. ఊహించని గిఫ్ట్‌లతో ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ప్రభాస్‌ ఇప్పుడు అదే చేశాడు. తన వద్ద పనిచేసే పర్సనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌కి ఖరీదైన కారుని బాహుమతిగా ఇచ్చి షాక్‌తోపాటు ఆశ్చర్యానికి గురి చేశాడు. 

ఏకంగా లక్షల విలువ చేసే రేంజ్‌రోవర్‌ కారుని బహుమతిగా డార్లింగ్‌ స్టార్‌ ప్రభాస్‌ ఇవ్వడంతో లక్ష్మణ్‌ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ప్రభాస్‌ ఫ్యాన్స్ ట్రెండ్‌ గ్రూప్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ట్రెండ్‌ చేస్తున్నారు. మా సాహో స్టార్‌ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారని చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ ఓ సైన్స్ ఫిక్షన్‌ చేయబోతుండగా ఇందులో దీపికా పదుకొనె కథానాయిక. దీంతోపాటు ఓం రౌత్‌ డైరెక్షన్‌లో బాలీవుడ్‌ చిత్రం `ఆదిపురుష్‌`లో నటించనున్న విషయం తెలిసిందే.