డార్లింగ్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన `రాధేశ్యామ్‌` గత నెలలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీసు వద్దనిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభాస్‌ ఫస్ట్ టైమ్‌ స్పందించారు.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నటించిన రీసెంట్ చిత్రం `రాధేశ్యామ్‌`(Radheshyam). పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన చిత్రమిది. ఆయనకు జోడీగా పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయికగా నటించింది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రానికి మిక్స్ డ్‌ టాక్‌ వచ్చింది. `బాహుబలి`, `సాహో` వంటి భారీ యాక్షన్‌ సినిమాలు చేసిన ప్రభాస్‌ని `రాధేశ్యామ్‌` వంటి లవ్‌ స్టోరీ చిత్రంలో ఆడియెన్స్ చూడలేకపోయారు. 

ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ ఏజ్‌లో, ఈ టైమ్‌లో ప్రభాస్‌ లవ్‌ స్టోరీ చేయడం కరెక్ట్ కాదని, దాన్ని ఫ్యాన్స్ సైతం రిసీవ్‌ చేసుకోలేకపోయారనే టాక్‌ వినిపించింది. పైగా భారీ బడ్జెట్‌ పెట్టడం కూడా ఈ చిత్రానికి పెద్ద మైనస్‌. వంద కోట్ల లోపు బడ్జెట్‌తో తీస్తే వర్కౌట్‌ అయ్యేది ఎందుకంటే. ఈ చిత్రం ఓవరాల్‌గా రెండు వందలకుపైగా కలెక్షన్లని రాబట్టింది. అదే వంద కోట్ల లోపు బడ్జెట్‌తో తీస్తే పెద్ద హిట్‌గానూ నిలిచేది. అయితే ప్రభాస్‌ పారితోషికం కూడా పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. మొత్తానికి ఈ చిత్రం డిజాస్టర్‌ జాబితాలో చేరిపోయింది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంపై ప్రభాస్‌ ఫస్ట్ టైమ్‌ స్పందించారు(Prabhas React On Radheshyam). `రాధేశ్యామ్‌` ఫెయిల్‌కి కారణమేంటో విశ్లేషించారు. ఈ చిత్ర రిలీజ్‌ టైమ్‌కి కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకపోవడమే కారణం అనుకుంటున్నట్టు తెలిపారు. అంతేకాదు ప్రేమ కథల్లో తనని ఆడియెన్స్ ఇష్టపడి ఉండకపోవచ్చు అని, లేక స్క్రిప్ట్ లోనే లోపం కూడా ఉండవచ్చు అని తెలిపారు. మొత్తంగా సినిమా ఫెయిల్‌ని ఆయన అంగీకరించారు. 

అయితే తనకు `బాహుబలి` లాంటి సినిమాలు చేయడం ఇష్టమే అని, అలాగని ఎప్పుడూ అలాంటి సినిమాల్లో నటిస్తే నటుడిగా కొత్తదనం చూడలేనని తెలిపారు. వైవిధ్యమైన, విభిన్నమైన సినిమాలు చూడాలనుకుంటున్నట్టు చెప్పారు ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన `సలార్‌`, `ఆదిపురుష్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రాల్లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో మరో సినిమా చేయబోతున్నారు. భారీ సినిమాల లైనప్‌తో మరో మూడేళ్లు బిజీగా ఉన్నారు డార్లింగ్‌.