Asianet News TeluguAsianet News Telugu

భీమవరంలో సందీప్ వంగా కారుకి అడ్డు పడిన ప్రభాస్ అభిమానులు..హామీ ఇచ్చాకే వదిలిపెట్టిన వైనం

సందీప్ వంగ బోల్డ్ చిత్రాలతో ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. రీసెంట్ గా సందీప్ వంగా యానిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

Prabhas Fans blocked Sandeep reddy vanga car in bhimavaram dtr
Author
First Published Jan 17, 2024, 3:40 PM IST

ఇటీవల కాలంలో తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియా సెన్సేషన్ గా మారుతున్నారు. రాజమౌళి, సుకుమార్, సందీప్ వంగ, చందు ముండేటి, లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ ఇలా పాన్ ఇండియా డైరెక్టర్లు టాలీవుడ్ నుంచి పుట్టుకొస్తూనే ఉన్నారు. సందీప్ వంగ బోల్డ్ చిత్రాలతో ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. రీసెంట్ గా సందీప్ వంగా యానిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 

దీనితో సందీప్ తదుపరి చిత్రాలపై మరింతగా ఆసక్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా ప్రభాస్ తో సందీప్ చేయబోతున్న స్పిరిట్ చిత్రం కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి స్పిరిట్ మొదలవబోతున్నట్లు సందీప్ ప్రకటించారు. 

అయితే రీసెంట్ గా సందీప్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు భీమవరం వెళ్లారు. భీమవరంలో ప్రభాస్ అభిమానుల హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. సందీప్  కారుని గమనించిన ప్రభాస్ అభిమానులు వెంటనే అడ్డు పడ్డారు. స్పిరిట్ చిత్ర విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. యానిమల్ అద్భుతంగా ఉందని.. అంతకి మించేలా స్పిరిట్ ఉండాలని ఫ్యాన్స్ అడిగారు. 

తప్పకుండా అదిరిపోయే మూవీ తీస్తానని హామీ సందీప్ నుంచి లభించిన తర్వాతే ఫ్యాన్స్ కారుకి అడ్డు తొలిగారు. ఈ వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సందీప్ రెడ్డి వంగా చిత్రాల్లో బోల్డ్ సన్నివేశాలు ఎలా ఉంటాయో ఎమోషనల్ సీన్స్, ఇంటెన్స్ డ్రామా కూడా అదే స్థాయిలో ఉంటుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios