ప్రభాస్ బాగా సన్నపడుతున్నారు. గతంలో బాహుబలి కోసం భారీగా మారిన ఆయన ఇప్పుడు ఆదిపురుష్ లో తన గెటప్ కోసం సన్నపడుతున్నారని సమాచారం. ఇక్కడ మీరు చూస్తున్న లుక్ అదే. డైరక్టర్ సూచన మేరకు శ్రీరాముడిలా సన్నగా కనిపించేందుకు రూపం మార్చుకుంటున్నారట. సన్నగా అంటే పూర్తిగా పై నుంచి క్రిందకు సన్నపడటం కాకుండా  భుజ బల సంపన్నుడిగానే కనిపిస్తూ శరీరాకృతిని పూర్తిగా సన్న పరుస్తాడట. ఇది కాస్త కష్టమైన ఫీటే. 

కానీ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్ సలహాతో కొంతమంది పోషకాహార టీమ్ తో  కలిసి అందుకోసం ప్రత్యేకమైన డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజులు చేస్తున్నారట. అయితే ఈ ఎఫెక్ట్.. రాధే శ్యామ్ లోని క్లైమాక్స్ లోనూ కనపడే అవకాసం ఉందిట. ఆ  షూట్ లో పాల్గొంటూనే స్లిమ్ గా మారిపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరో ప్రక్క శ్రీరాముడులా..నీలి రంగులు అద్దుకున్న రూపంతో ప్రభాస్ అభిమానులకు ట్రీటివ్వబోతున్నాడని చెప్తున్నారు. 

ఇందులో హీరోయిన్స్ ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ చిత్రం జనవరి నుండి  షూటింగ్ కు వెళ్లనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో రావణ్ పాత్రను పోషించనున్నారు. రాధే శ్యామ్ షూటింగ్ పూర్తయ్యాక అతను ఈ చిత్రానికి ప్రిపరేషన్ ప్రారంభిస్తాడు. ఆదిపురుష్ 2022 ఆగస్టు 11 న హిందీతో పాటు అన్ని దక్షిణ భారత భాషలలో విడుదల కానుంది. ఇది 3డి 2డి వెర్షన్లలో తెరకెక్కనుంది. ఆ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన వెలువరించింది.