ఈ మధ్య ప్రభాస్ కు ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రశ్న ఎదురవుతుందట. అదే పెళ్లెప్పుడూ అని. అయితే ఎంత మంది ఎన్ని విధాలుగా అడిగిన యంగ్ రెబల్ స్టార్ మాత్రం ఓపిగ్గా సమాధానం చెపుతున్నాడ. ఇంతకీ పెళ్ళి గురించి ప్రభాస్ ఇచ్చిన క్లారిటీ ఏంటీ..?
ఈ మధ్య ప్రభాస్ కు ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రశ్న ఎదురవుతుందట. అదే పెళ్లెప్పుడూ అని. అయితే ఎంత మంది ఎన్ని విధాలుగా అడిగిన యంగ్ రెబల్ స్టార్ మాత్రం ఓపిగ్గా సమాధానం చెపుతున్నాడ. ఇంతకీ పెళ్ళి గురించి ప్రభాస్ ఇచ్చిన క్లారిటీ ఏంటీ..?
రీసెంట్ గా రిలీజ్ అయిన రాధేశ్యామ్ తో వెనకడుకు పడ్డా.. అంతే స్పీడ్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఒపిగ్గా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇక యంగ్ రెబల్ స్టార్ ఎదురైనప్పుడల్లా.. మీడియా ప్రతినిధులు ప్రభాస్ సార్ మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తూనే ఉంటారు. దీంతో ప్రభాస్ అసౌకర్యంగా భావించడం ఎన్నో సందర్భాల్లో కనిపించింది. అయినా వారు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా మరో మారు పెళ్లిపై ప్రశ్నను ప్రభాస్ ఫేస్ చేశారు.
నిజానికి ప్రభాస్ పెళ్లి గురించి చాలా రూమర్స్ వినిపించాయి. వైజాగ్ అమ్మాయితో ప్రభాస్ పెళ్ళిఅంటూ గతంలో ఓ మాట వినిపించింది. ఆతరువాత అనుష్క శెట్టికి, ప్రభాస్ కు మధ్య లవ్ ఉందంటూ రూమర్ గట్టిగా నడిచింది. విదేశాల్లో వీరిద్దరు ఇల్లు కూడా కట్టుకున్నారన్నారు. ఆతరువాతే అటువంటిదేమీ లేదంటూ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కొట్టిపడేశారు. తాము మంచి స్నేహితులమంటూ ఇరువురూ స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి ఎవరా అన్న ఆసక్తి యాన్స్ తో పాటు సినీ అభిమానుల్లో నెలకొంది.
ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందర్భంగా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఎక్కడికి వెళ్లినా తనను దీనిపైనే అడుగుతుంటారని ప్రభాస్ చెప్పారు. దీన్ని పట్టించుకుంటారా అని న్యూస్ ప్రతినిథులు అడిగారు.. దానికి సమాధాణంగా ప్రభాస్ లేదని బదులిచ్చారు. నాపెళ్ళి గురించి అడిగినప్పుడు నాకేమీ చిరాకు అనిపించదు. ఇది జనరల్ గా ఎదురయ్యే ప్రశ్నే. మీ స్థానంలో నేను ఉన్నా దీనిపై నాకు ఆసక్తి ఉంటుంది అని సింపుల్ గా సమాధానం చెప్పారు.
అంతే కాదు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారా అని ప్రశ్నించగా..దీనికి సమాధానం నా దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా చెపుతానంటూ..ప్రభాస్ పెద్దగా నవ్వేశారు. దీంతో ప్రభాస్ తన పెళ్ళి గురించి ఇప్పట్లో ఎవరూ ఆలోచరించవద్దు అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అయ్యింది. ఆయన పెళ్లి కోసం అభిమానులు ఇంకా వెయిట్ చేయక తప్పేట్లు లేదు.
