Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రీరిలీజ్ కు ముస్తాబుతున్న ఛత్రపతి సినిమా..

ఆమధ్య రీరిలీజ్ ల ట్రెండ్ గట్టిగా నడుస్తున్నసంగతి తెలిసిందే.. స్టార్ హీరోల బర్త్ డేలు ఉంటే చాలు వాళ్ళ కెరీర్ లో చాలా ఇంపార్టెన్ట్ అనుకున్న మూవీని రీరిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఇక తాజాగా యంగ్ రెబల్ స్టార్ నటించిన ఛత్రపతి రీరిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

Prabhas Chatrapathi Movie Re Release on october23 JMS
Author
First Published Oct 19, 2023, 2:27 PM IST

ప్రస్తుతం నడుస్తున్న రీరిలీజ్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్స్ లాండ్ మార్క్ మూవీస్ తీసుకుని అకేషన్స్ ప్రకారం రీరిలీజ్ చేయడం అనవాయితీగా మారింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాన్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరు, బాలయ్య సినిమాలు ఇప్పటికే రీరిలీజ్ ట్రెండ్ లోకి వచ్చాయి ఈ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.. అవుతున్నాయి. ఈక్రమంలో యంగ్ రెబల్ స్టార్ ఎవర్ గ్రీన్ మూవీ ఛత్రపతి రీరిలీజ్ కు మూస్తావు అవుతుంది. ఇంతకీ అకేషన్ ఏంటంటే ప్రభాస్ భర్త్ డే. 

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న ఛత్రపతి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిని 4కే వెర్షన్ లో అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ అన్నింటిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో కోట శ్రీనివాస్ రావు, ప్రదీప్ రావత్, జై ప్రకాష్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు. సలార్ కంటే ముందే డార్లింగ్ అభిమానులకు  ఈ సినిమా ద్వారా స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ ప్రభాస్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా డార్లింగ్ క్రేజ్ మారిపోయింది. ఈ మూవీలో ప్రభాస్ నటనకు విమర్శకులే ఫిదా అయ్యారు. కానీ ఆ తర్వాత డార్లింగ్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్, కల్కీ చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

  ప్రభాస్, శ్రియా జంటగా నటించిన ఛత్రపతి సినిమాకు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు. 2005లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. పూర్తిగా మాస్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో భానుప్రియ కీలకపాత్ర పోషించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios