Asianet News TeluguAsianet News Telugu

#Prabhas ప్రభాస్ 'బాడీ డబుల్' కు సినిమాకు 9 కోట్లా? ఆశ్చర్యం కదా

బాడీ డబుల్ అంటే అదే స్దాయి రిస్క్ కూడా ఉంటుంది. సలార్, కల్కి 2029చిత్రాలలో చాలా స్ట్రెయిన్ అయ్యే స్టంట్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. 

Prabhas body double pockets Rs 9 crore per film? jsp
Author
First Published Jan 22, 2024, 4:09 PM IST | Last Updated Jan 22, 2024, 4:09 PM IST

 


స్టార్ హీరోల సినిమాల్లో బాడీ డబుల్ అనేది కామన్ గా జరుగుతూంటుంది.  ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ లో  బాడీ డబుల్‌ ని తీసుకుంటారు. సాధారణంగా బాడీ డబుల్‌గా హీరో లాగా కనిపించే వ్యక్తినే వాడుతారు. అలా ప్రభాస్ లాగ కనిపించే వ్యక్తిని కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ లో బాడీ డబుల్ గా వాడతారు. అయితే ఆ బాడీ డబుల్ కు ఎంత ఇస్తారు అనేది బయిటకు రాదు. అలాగే ఆ బాడీ డబుల్ గా కనిపించే వ్యక్తి హైలెట్ అవ్వరు.  ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ కు బాడీ డబుల్ గా చేసే వ్యక్తి నెలకు 9 కోట్లు వరకూ సంపాదిస్తున్నారని   ఆంగ్ల దినపత్రిక వారి కథనం. 

ఆ పత్రికలో వచ్చిన సమచారం మేరకు ప్రభాస్ బాడీడబుల్ గా చేసే వ్యక్తి 30 లక్షలు వరకూ రోజకు ఛార్జ్ జచేస్తారు. అలాగే ఆయన నెలలో 30 రోజులు బిజీగా ఉంరారు. దాదాపు  ప్రభాస్ చేసే సినిమాలు అన్నిటిలోనూ ఆయనే ఉంటారు. దాంతో సినిమాకు 9 నుంచి 10 కోట్లు వరకూ సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాడీ డబుల్ అంటే అదే స్దాయి రిస్క్ కూడా ఉంటుంది. సలార్, కల్కి 2029చిత్రాలలో చాలా స్ట్రెయిన్ అయ్యే స్టంట్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. రిస్క్ కు తగ్గ సంపాదన ఉంటుంది. ఇండియన్ తెరపై హైయిస్ట్ పెయిడ్ బాడీ డబుల్ గా చెప్తున్నారు. ప్రభాస్ వెయిట్, ఫిజిక్ కు ఫెరఫెక్ట్ గా సరిపోతారు. ఇక రాజాసాబ్ లాంటి ఫన్ తో కలిసిన ఫిల్మ్ లో కూడా ఆయనకు చాలా పని ఉందిట. ఆ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొనబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభాస్ డేట్స్ అయినా దొరుకుతాయేమో కానీ ఆ బాడీ డబుల్ చేసే వ్యక్తి డేట్స్ మాత్రం చాలా కష్టంగా మారాయని నిర్మాతలు ,దర్శకులు వాపోతున్నారట. 
 
ఇక ప్రభాస్  చాలా కాలం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' పార్ట్-1తో రెబల్ స్టార్ ప్రభాస్ కమర్షియల్ హిట్ సాధించాడు. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి దాదాపు 700కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.  ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘సలార్’.‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్..  ప్రభాస్ తో చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంలో ఓపినింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. తర్వాత కూడా సంక్రాంతి సినిమాలు వచ్చేదాకా బాగా ఆడింది.    సలార్ సూపర్ హిట్ అవడంతో ప్రభాస్ తన టీమ్ తో కలిసి ఇప్పటికే రెండుసార్లు సక్సెస్ పార్టీ చేసుకున్నారు.  
   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios