జపాన్ లో ఘనంగా ప్రభాస్ బర్త్ డే వేడుకలు, మనవాళ్ళను మించిపోయారుగా..
ఇండియా కంటే ముందే జపాన్ లో ప్రభాస్ భర్త్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రభాస్ ను ఎంతగానో ప్రేమించే అభిమానులు అక్కడ ఉన్నారు. వారు రకరకాల పద్దతుల్లో యంగ్ రెబల్ స్టార్ పై తమ ప్రేమను చాటుకున్నారు.

యంగ్ రెబల్ స్టార్.. యూనివర్సల్ హీరో ప్రభాస్ బర్త్ డే వేడుకలకుఅంతా సిద్దం అయ్యింది. రెబల్ అభిమానులంతా.. ప్రభాస్ బర్త్ డే ను ఘనంగా జరపడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ జపాన్ లో స్టార్ హీరో ఇమేజ్ సాధించాడు. ఆయనంటే ప్రాణంగా ప్రేమించే అభిమానులు ఉన్నారు అక్కడ. ప్రభాస్ కోసం జపాన్ నుంచి హైదరాబాద్ కు చాలా సార్లు.. చాలా మంది అభిమానులు ప్రత్యేకంగా వచ్చారు కూడా. ఇక ప్రభాస్ బర్త్ డే రావడంతో..ఈ అకేషన్ ను పండగలా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఈసారి దసరా పండుగతో పాటు ప్రభాస్ పుట్టినరోజు వేడుక కూడా రావడంతో.. రెబల్ అభిమానులకు కలిసొచ్చింది. దీంతో ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఫ్యాన్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ఛత్రపతి ని రీ రిలీజ్ చేసి సందడి చేయనున్నారు.
ప్రభాస్ అలాగే బ్యానర్స్, సేవ కార్యక్రమాలు, కేక్ కటింగ్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల యూత్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ భారీ కటౌట్ ను ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక్రమంలో జపాన్ లో కూడా ప్రభాస్ బర్త్ డేను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్కడి ఫ్యాన్స్.. ఒక రూమ్ మొత్తాన్ని ప్రభాస్ ఫొటోలతో నింపేశారు. ఇక ఫోటోలకు పూలదండలు వేసి, ప్రసాదాలు పెట్టి ఒక పండగలా నిర్వహిస్తున్నారు.
ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ప్రభాస్ మీద అభిమానంతో అక్కడ వస్తువలకు.. కొన్ని ప్రాడెక్ట్స్ కు ప్రభాస్ బ్రాండ్ తో మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ఆయన ఫ్యాషన్ ను కూడా జపాన్ లో బాగా ఫాలో అవుతుంటారు. తాజాగా ప్రభాస్ బర్త్ డే కోసం ఇంకాస్త హడావిడి చేయబోతున్నారు. ఇక త్వరలో ప్రభాస్ నుంచి సలార్ మూవీ రిలీజ్ కాబోతోంది. సలార్ తరువాత పాన్ వరల్డ్ మూవీ కల్కీ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది.