Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ అనుష్కల పెళ్లికి అభిమానులే పెళ్లి పెద్దలా...

  • ప్రభాస్ అనుష్కల పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో
  • ఇద్దరి మధ్య విడదీయలేని ఎఫెక్షన్ ఉందని దాని సారాంశం
  • మరి అనుష్క, ప్రభాస్ ల పెళ్లికి అభిమానులె పెద్దలవుతారా..
  • ప్రభాస్ కు పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యుల ఒత్తిడి
PRABHAS ANUSHKA MARRIAGE RUMOURS GOING VIRAL AGAIN

తెలుగు సినీ హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది. అనుష్క ప్రభాస్ ను వదిలి ఉండలేనని ఇప్పటికే బహిరంగంగానే స్టేట్ మెంట్ ఇచ్చేసింది. మరోవైపు బాహుబలి చిత్రం షూటింగ్ సందర్భంగా ప్రభాస్, అనుష్క ఇధ్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలో వీరు పెళ్లాడబోతున్నారని ప్రచారం జోరందుకుంది. ప్రభాస్ పై అనుష్క ఏ రెంజ్ లో  ఎఫెక్షన్ చూపిస్తోందో తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది.

 

ప్రభాస్, అనుష్క ఇద్దరూ ఇన్నాళ్లుగా పెళ్లికి దూరంగా ఉండటానికి కారణం... ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటమే అందుకే ఇద్దరూ ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నారని, బాహుబలి సినిమా కోసం ఏళ్ల తరబడి కలిసి పనిచేసిన క్రమంలోనే ఇద్దరూ దగ్గరయ్యారని, ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు బాగా అర్థం చేసుకున్నారని, ఈ క్రమంలోనే ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారని... బాహుబలి సినిమా షూటింగ్ ముగిసే సమయానికి ఇద్దరి ప్రేమ వ్యవహారం మరింత ముదిరిందని టాక్.

 

త్వరలోనే ప్రభాస్ నాలుగు పదులకు చేరుతుండటంతో ఇంట్లో కూడా పెళ్లి గురించి ఒత్తిడి బాగా పెరగటం సహజం. ఇంకా కొంతకాలం డేటింగ్ చేద్దామని అనుకున్నప్పటికీ కుటుంబ సభ్యుల ఒత్తిడితో త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారని ఫిలింనగర్ వర్గాల టాక్. అనుష్క కూడా ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఆమె వయసు కూడా 35కి చేరువైంది. ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టే అనుష్క తన పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చిందని అంటున్నారు.

 

బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ తో పాటు అతని ఫ్యామిలీకి కూడా అనుష్క దగ్గరైంది. అనుష్క చాలా మంచి అమ్మాయి అని రాజమౌళి ఫ్యామిలీ కూడా రికమెండ్ చేసిందట. అలా పెళ్లికి లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది. తమ ప్రేమ విషయం ఇన్నాళ్లు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటంలో ప్రభాస్, అనుష్క సక్సెస్ అయ్యారు. ఇన్నాళ్లు బాహుబలి సెట్స్ లోనే ఉంటూ వచ్చారు కాబట్టే అది సాధ్యమైంది.

 

మరోవైపు అభిమానులు కూడా  ప్రభాస్, అనుష్క వివాహం జరిగితే హ్యాపీ అంటున్నారు. ఇద్దరి ఈడు జోడు బాగా కుదురుతుందని, ఈ జంట సినిమాల్లోనేకాకుండా.. నిజ జీవితంలోనూ చూడ ముచ్చటగా ఉంటారని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. ఊరంతా కోడై కూస్తున్నా వీళ్లు ఏమీ మాట్లాడట్లేదంటే.. మరి మూడు ముళ్లకు ముహూర్తం పెడతారా.. ఈ పెళ్లికి అభిమానులే పెళ్లి పెద్దలవుతారా.. ఏమో.. సోషల్ మీడియాలో మన ఫ్యాన్స్ జోరు చూస్తుంటే.. పెళ్లి.. చేసేటట్టే ఉన్నారు. మాళ్ల మనసులో ఏముందో కాని.

 

That answer from #Sweety without even thinking for a second😍😍😍 obviously #Prabhas is more sexier She said #Rana Is like Her Bro... Then what about #Prabhas ( SOMETHING SOMETHING ) 😜😜😜😜 . . @prabhas_anushka_holics @prabhas_anushka_holics @prabhas_anushka_holics @prabhas_anushka_holics @prabhas_anushka_holics @prabhas_anushka_holics #Pranushka ❤❤ #prabhas #anushka #bahubali2 #uppalapatiprabhasraju #anushkashetty #darlingsweety #Darling #Sweety #prabhas_raju #anushkashetty #amarendrabaahubali #lovethem #prabhasanushka #Anushkaprabhas #Prabhasraju #prabhasrajuuppalapati #uppalapatiprabhas #uppalapatiprabhasraju #anushka #Anushkashettyprabhasraju #devasena #baahubalitheconclusion #baahubalithebiginning #epicmovie . .

A post shared by Anushka prabhas (@prabhas_anushka_holics) on May 14, 2017 at 3:52am PDT

Follow Us:
Download App:
  • android
  • ios