ఓటు వేయని ప్రభాస్.. ఎందుకు? మరి వీళ్లు కూడా కనిపించలేదేంటీ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. టాలీవుడ్ లోని అగ్ర హీరోలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ డార్లింగ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో రీజన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా పూర్తైంది. ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఆయా పోలింగ్ సెంటర్లలో ఓటు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట పెద్దఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయా సెంటర్లలో మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, నమ్రతా, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రానా దగ్గుబాటి, నాని తమ ఓటు హక్కును జుబ్లీహిల్స్, చుట్టు పక్కా ప్రాంతాల్లోని సెంటర్లలో వినియోగించుకున్నారు.
కానీ డార్లింగ్ ప్రభాస్ (Prabhas) మాత్రం ఎక్కడా కనిపించలేదు. కొన్నాళ్లుగా ఎలాంటి ఈవెంట్లలోనూ కనిపించని ప్రభాస్ కనీసం ఈరోజైనా ఓటు హక్కును వినియోగించుకునేందుకు బయటికి వస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు టాలీవుడ్ సెలబ్రెటీలు తమ పనులన్నింటీని మానుకోవడం విశేషం. రామ్ చరణ్ (Ram Charan) మైసూర్ లో షూటింగ్ మానుకొని మరీ ప్రత్యేకంగా వచ్చారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఎందుకు తన ఓటు హక్కును వినియోగించుకోలేదనేది అభిమానులు ఆరా తీశారు. అలాగే మరికొందరు సెలబ్రెటీలు కూడా ఓటే వేయలేదని తెలుస్తోంది.
యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నెక్ట్స్ ‘సలార్’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేపు (డిసెంబర్ 1న) ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారంట. కానీ ప్రభాస్ మోకాళి సర్జరీతో ఫారేన్ లో ఉండటంతో సింపుల్ యూట్యూబ్ లోనే రిలీజ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ నెల రెండో వారంలో ఇండియాకు తిరిగి వచ్చిన డార్లింగ్ ఇంకా రెస్ట్ మోడ్ లోనే ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాలేదని అంటున్నారు. అలాగే మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కూడా ఓటు వేయలేదని తెలుస్తోంది. ‘కన్నప్ప’ షూటింగ్ లో ఫారేన్ లోనే ఉండాల్సి వచ్చిందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. టాలీవుడ్ లోని బడా హీరోలు, సెలబ్రెటీలు, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సామాన్య ఓటర్లు, లేచీలేవలేని ముసలివాళ్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ టాలీవుడ్ లోని యంగ్ హీరోలు అఖిల్ అక్కినేని, వరుణ్ తేజ్, అల్లరి నరేష్, శర్వానంద్, విశ్వక్ సేన్, తదితరులు పోలింగ్ సెంటర్ల వద్ద కనిపించలేదు. ఇంతకీ వీరికి ఇక్కడ ఓటు హక్కు ఉందా? లేక ఉండి మరే కారణాల వల్ల రాలేదా అనేది సందేహం మారింది. ఉంటే మాత్రం యంగ్ స్టార్స్ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.