ఈ ప్రాజెక్టు గురించిన వార్త నిన్నంతా మీడియాలో హల్ చల్ చేసింది. కాశ్మీర్ ఫైల్స్ నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారని ఆ వార్తలు సారాంశం.
ప్రభాస్ తో సినిమా చెయ్యాలని ప్రతీ నిర్మాతకు ఉంటుంది. అయితే అందుకు చాలా సమీకరణాలు, లెక్కలు సెట్ కావాల్సి ఉంటుంది. అందుకు తగ్గ ప్రపోజల్స్ పెడుతూంటారు. ఈ లోగా కొన్ని వార్తలుగా మీడియాలో వచ్చేస్తూంటాయి. అలాంటిదే ప్రభాస్,సుకుమార్ కాంబినేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు గురించిన వార్త నిన్నంతా మీడియాలో హల్ చల్ చేసింది. కాశ్మీర్ ఫైల్స్ నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారని ఆ వార్తలు సారాంశం. అయితే అలాంటిదేమీ లేదని అది ఫేక్ న్యూసే అని ఆ నిర్మాత మీడియా వర్గాలలతో తేల్చి చెప్పారు. అంత గొప్ప ప్రాజెక్టు సెట్ అయితే ముందు తామే ఉత్సాహంగా చెప్తాము కదా అని అంటున్నారు. అది న్యూస్ ఎలా పుట్టింది అనేది గెస్ చేయటం కష్టమేమీ కాదు.
సుకుమార్, అభిషేక్ అగర్వాల్ కాంబినేషన్ లో ప్రాజెక్టు ఉండబోతుందని ఆ మధ్యన సోషల్ మీడియా ఓ ఫొటో షేర్ చేసి మరీ వార్త ఇచ్చారు. అయితే హీరో ఎవరో చెప్పలేదు. గతంలో సుకుమార్ తో ప్రభాస్ సినిమా చేస్తాను అన్నారు కాబట్టి ఆ న్యూస్ ఆ గెస్సింగ్ లోంచి పుట్టే అవకాసం ఉంది. అయితే సుకుమార్, ప్రభాస్ కాంబినేషన్ చూడాలని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారనేది నిజం. అందులోనూ పుష్ప2 చిత్రం తర్వాత ఏ హీరోతో సుకుమార్ చేస్తారు అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఖచ్చితంగా ప్యాన్ ఇండియా ఫిల్మ్ చేస్తారనేది మాత్రం నిజం.
వాస్తవానికి రంగస్థలం రిలీజ్ కి ముందే ప్రభాస్ ని కలిసి సుకుమార్ స్టోరీ చెప్పారంట. కథకి ప్రభాస్ ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయని అన్నారు. అయితే అప్పటి నుంచి ప్రభాస్ బిజీగా ఉన్నారు. సుకుమార్ పుష్ప ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఏదైమైనా ఈ కాంబిలో సినిమా ప్రకటన కోసం ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఈ విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే సినిమా షూటింగ్ ను 85% పూర్తి చేసేసారు. వచ్చే ఏడాది జనవరి కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్ట్ కే” అనే సినిమాతో బిజీ కాబోతున్నారు.
ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత ప్రభాస్ అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా ధర్శకత్వంలో “స్పిరిట్” అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అలాగే దిల్ రాజు మరియు మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా ప్రభాస్ కమిట్‌మెంట్స్‌తో ఉన్నాడు. సరైన డైరక్టర్స్ ని... ప్రభాస్ కు సెట్ చేయటం ఆ నిర్మాతలకు కష్టంగా మారడంతో ప్రాజెక్టులు ఇంకా కార్యరూపం దాల్చలేదు.
