ప్రభాస్..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా విశేషాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది.  అందులోనూ ‘మహానటి’ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వినీదత్ భారీ ఎత్తున  నిర్మించనుండటం కోసం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది....ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ప్రభాస్ డేట్స్ వంటి విషయాలు గురించిన సమాచారం మీకు అందిస్తున్నాం.

ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా కోసం నాగ అశ్విన్ ప్రస్తుతం టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. నవంబర్ నుంచి ప్రభాస్ ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చారు. దాంతో నవంబర్, డిసెంబర్ లలో కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేస్తారు. అయితే ప్రభాస్ షూటింగ్ రాకముందు నుంచే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఎందుకంటే సినిమాలో బోలెడు విఎఫ్ ఎక్స్ వర్క్ ఉంది. దాంతో ప్రభాస్ వచ్చేలోగా ఈ సీన్స్ ఫినిష్ చేసి,గ్రాఫిక్స్ కు పంపుతారు.

 ఆ సీన్స్ లో ప్రభాస్ ఉండాల్సిన అవసరం లేదు. నాగ అశ్విన్ చాలా తెలివిగా ప్లాన్ చేసి అనుకున్న టైమ్ కు ఈ సినిమాని రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.ఇక ఈ చిత్రం ఏ జానర్ లో ఉండబోతోందనే విషయమై ఇప్పటిదాకా ఏ విధమైన క్లూ ఇవ్వలేదు. అనేకమైన వార్తలు ప్రచారంలో ఉన్నా సైలెంట్ గా ఉన్నారు. 2021 చివరి నాటికి రిలీజ్ ఉంటుందంటున్నారు.

 హీరోగా ప్రభాస్.. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఈ బ్యానర్‌లో మూడు తరాలకు చెందిన టాలీవుడ్ స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రభాస్.. ప్రతిష్ఠాత్మకమైన ఈ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నాడు. 
ఈ సినిమాని 200 కోట్ల బడ్జెట్ తో మొదలెడుతున్నారని, అలాగే ఈ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టు అనీ, ఈ సినిమాలో ప్రభాస్ ఓ సూపర్ హీరోగా కనపడనున్నారని, ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి.

 అయితే అందులో ఎంతవరకూ నిజం ఉంటుందనేది సందేహమే. అలాగే ఈ సినిమాకు మాత్రం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారట.అశ్వనీదత్ ఈ సినిమాని నెవ్వర్ బిఫోర్..నెవ్వర్ ఆఫ్టర్ తరహాలో ప్లాన్ చేస్తున్నాడట.వైజయంతి మూవీస్‌ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.   ఈ సినిమా టైటిల్‌, కథ, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.