Prabhas : ప్రపంచ వ్యాప్తంగా 20 వేల స్క్రీన్స్ లో సినిమా రిలీజ్..? భారీ ప్లానింగ్ లో ప్రభాస్

పాన్ వరల్డ్ స్థాయిలో దూకుడు చూపిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). భారీ స్కెచ్ గీస్తున్నాడు. యూనివర్సల్ రేంజ్ లో ఇమేజ్ ను పెంచుకునే పథకం పన్నాడు ప్రభాస్. 

Prabhas Adipurush Movie Update

పాన్ వరల్డ్ స్థాయిలో దూకుడు చూపిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). భారీ స్కెచ్ గీస్తున్నాడు. యూనివర్సల్ రేంజ్ లో ఇమేజ్ ను పెంచుకునే పథకం పన్నాడు ప్రభాస్.

చేతి నిండా సినిమాలు.. పాన్ ఇండియా ఇమేజ్ తో మంచి జోష్ మీద ఉన్నాడు యూనివర్సల్ స్టార్ ప్రభాస్(Prabhas). ఏమంటా బాహుబలి చేశాడో.. ప్రభాస్ జాతకమే మారిపోయింది. బాలీవుడ్ స్టార్స్ కూడా ప్రభాస్ స్థాయిని అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. 100 కోట్ల నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ హీరోగా అవతరించాడు ప్రభాస్(Prabhas).

ప్రస్తుతం ప్రభాస్(Prabhas)  చేసితో ఐదు సినిమాలకు పైనే ఉన్నాయి. ఆయన నటించిన రాధేశ్యామ్ రిలీజ్ కు రెడీగా ఉంది. సలార్,ఆదిపురుష్(Adipurush)   షూటింగ్ సెట్స్ ..లో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీని ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్..నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఇక వీటితో పాటు మరికొన్ని కథలను లైన్ లో పెట్టాడు ప్రభాస్(Prabhas). మారుతీతో కూడా ఓ మూవీ ప్లానింగ్ లో ఉంది.

ఇక పోతే బాలీవుడ్ లో రామాయణ కావ్యం ఆధారంగా ఓంరౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ రాముడిగా తెరకెక్కింతుంది ఆదిపురుష్(Adipurush)   సినిమా. భారీ పురాణగాథ ఆదిపురుష్(Adipurush)   లో రాముడిగా టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రభాస్(Prabhas) లుక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో  నటిస్తున్నారు.

అయితే, ఇప్పుడు ఆదిపురుష్(Adipurush)   కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా  వినిపిస్తోంది. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తవడంతో త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను అంతే భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

15 భారతీయ భాషలను కలుపుకుని.. వివిధ దేశాల భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20 వేల స్క్రీన్ల పై ఆదిపురుష్(Adipurush)  సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషచం తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇదే కనుక జరిగితే.. పాన్ వరల్డ్ స్టార్ గా ప్రభాస్(Prabhas) రేంజ్ మారుమోగిపోతుంది. యూనివర్సల్ స్టార్ అన్న టైటిల్ ప్రభాస్(Prabhas)  కు పక్కాగా ఫిక్స్ అవుతుంది అని సంతోషంలో  ఉన్నారు అభిమానులు.

అయితే ఈ విషయంపై ఇంత వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. త్వరలో ఈ విషయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.ఇప్పుడు కరోనా పాండమిక్ టైమ్ నడుస్తుండటం.. పరిస్థితులు కుదుట పడిన తరువాత ఈ ప్లానింగ్ ను వర్కైట్ చేస్తారం. మరో వైపు కరోనా కారణంగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ను ఓటీటీలో రిలీజ్ చేస్తారు అన్న రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios