Asianet News TeluguAsianet News Telugu

#TheRajaSaab ప్రభాస్ పేరు మార్చుకున్నారా? న్యూమరాలజినా?

మారుతీ దర్శకత్వం వహించిన ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూసిన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.వివిధ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా పోస్టర్ లో ఓ చిత్రం కనపడింది.

Prabhas added an extra S to his name. From #TheRajaSaab jsp
Author
First Published Jan 15, 2024, 12:43 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌ ( Maruthi)  లో రూపొందుతున్న చిత్రం నుంచి సంక్రాంతి సందర్బంగా అప్డేట్ వ‌చ్చింది.  ఈ  ఫస్ట్‌ లుక్‌ లాంఛ్ సందర్భంగా ప్రభాస్ అభిమానులు భారీ ఎల్‌ఈడీ డిజిటల్‌ కటౌట్‌ను రెడీ చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టైటిల్ ను కానీ ఫస్ట్ లుక్ ని కానీ ఇప్పటి వరకు రివీల్ చేయకుండా జాగ్రత్త పడి ఇప్పుడు సంక్రాంతి పండగ సందర్బంగా సినిమా అఫీషియల్ టైటిల్ ను ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో ప్రభాస్ నడిచొస్తున్న ఈ ఫస్ట్ లుక్ సింపుల్ గా అదిరిపోయిందనే  చెప్పాలి.

 ఇక సినిమాకి టైటిల్ గా…ది రాజా సాబ్(The Raja Saab) అనే టైటిల్ ను కన్ఫాం చేశారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది అంటూ మారుతి అనౌన్స్ చేయగా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుందని అంటున్నారు. ఇదంతా బాగానే ఉంది అయితే ఈ సినిమా పోస్టర్ లో ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. అదే ఇప్పుడు హైలెట్ అవుతోంది.

ఈ పోస్టర్ ని నిశితంగా పరిశీలిస్తే,హీరో Prabhas పేరు ''Prabhass,'గా ఉంటుంది. దాంతో ప్రభాస్ న్యూమరాలిజీ ప్రకారం తన పేరును మార్చుకున్నాడా అనే ఊహాగానాలకు దారితీస్తోంది.  న్యూమరాలజీ ఆధారంగా 'S' జోడించబడిందని చెప్తున్నారు. అయితే,రాజా సాబ్ టీమ్ సోషల్ మీడియా పోస్ట్‌లలో అతనిని 'Prabhas' అనే ఉంది. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. అయితే దర్శకుడు న్యూమరాలిజీ ని బాగా నమ్ముతారు. ఆయన దర్శకుడు శేఖర్ సూరి సోదరుడు దగ్గర నేర్చుకున్నారు. తన సినిమా టైటిల్స్ నుంచి ప్రతీది న్యూమరాలిజీని ఫాలో అవుతారు. 

ఇక లోకల్ ఆడియన్స్ కి ఒకప్పటి ప్రభాస్ మిస్టర్ పెర్ఫెక్ట్, మిర్చి లాంటి… టచ్ ఉన్న కమర్షియల్ మూవీ ని ఇవ్వలేక్ పోయాడు….సలార్(Salaar) బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపినా కూడా వింటేజ్ ప్రభాస్ అయితే ఇంకా తిరిగి రాలేదు… ఇలాంటి టైంలో మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా మూవీని అనౌన్స్ చేయగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి అఫీషియల్ గా..వింటేజ్ లుక్ తో రావటం మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.  డైనోసార్‌.. పక్కా డార్లింగ్‌గా ట్రాన్స్ ఫర్మేషన్‌ అయిన లుక్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా లాంఛ్ చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios