పవర్ స్టార్ అనగానే పవన్ కళ్యాణ్ అనుకోవద్దు. ఈ వార్త కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడలో దిగ్గజ నటుడు రాజ్ కుమార్ కుటుంబానికి కూడా అంతే ఆదరణ ఉంది. రాజ్ కుమార్ ఉన్నప్పుడు సౌత్ హీరోలతో మంచి సంబంధాలు మైంటైన్ చేసేవారు. రాజ్ కుమార్ తర్వాత ఆయన కుమారులు పునీత్ రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్ స్టార్ హీరోలుగా కొనసాగుతూ సౌత్ నటులతో టచ్ లో ఉంటున్నారు. 

చాలా కాలం తర్వాత రాజ్ కుమార్ కుటుంబం, మెగాస్టార్ ఫ్యామిలీని కలుసుకుంది. కన్నడనాట పవర్ స్టార్ గా వెలుగొందుతున్న పునీత్ రాజ్ కుమార్ వ్యక్తిగతంగా చిరంజీవిని కలుసుకున్నారు. పునీత్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ రెండో కొడుకు యువరాజ్ కుమార్ వివాహం త్వరలో జరగనుంది. 

ఈ నేపథ్యంలో పునీత్ తన సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ తో కలసి వచ్చి చిరంజీవిని వివాహానికి ఆహ్వానించారు. చిరంజీవి, రాంచరణ్ లకు శుభలేఖలు అందించారు. ఈ సంధర్భంగా చిరు, రాంచరణ్ లతో పునీత్ కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.