పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీ బిజీ షెడ్యల్స్ లో ఉన్నారు. అటు సినిమాలు పెడ్డింగ్ లో ఉండగా.. పవన్ పొలిటికల్ గా బిజీ అయ్యారు. కాగా ఆయన అస్వస్థతకు గురయినట్టు తెలుస్తోంది. 

టాలీవుడ్ పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీ బిజీ. ఆయన్ను నమ్మకుని సగం షూటింగ్ చేసి పెట్టుకునన సినిమాలు ఆగిపోయి ఉన్నాయి. అయితే పవర్ స్టార్ మాత్రం పొలిటికల్ గా ఊపిరి మెసలనంత బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో ఆంధ్రలో ఎలక్షన్స్ జరుగనుండటంతో.. టీడీపీతోకలిసి జనసేన పోటీ చేయబోతన్నారు. ఈక్రమంలో పవర్ స్టార్ పొలిటికల్ మీటింగ్స్, ప్లానింగ్స్ కోసం తీరికలేకుండా గడుపుతున్నారు. 

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొత్తం మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో అన్ని సినిమాలు కూడా సగానికి దగ్గరకి వచ్చినవి సగం కంప్లీట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ తన సినిమాలకి మళ్ళీ చాలా గ్యాప్ ఇచ్చి ఫోకస్ పాలిటిక్స్ లో పెట్టారు. తాజాగా లోకేష్ యువగళం ముగింపు సభలో కూడా పవర్ స్టార్ పాల్గోన్నారు. అయితే లేటెస్ట్ గా తన హెల్త్ కి సంబంధించి పవన్ ఫ్యాన్స్ లోనే ఓ వార్త వైరల్ అవుతుంది.

హీరోయిన్ గా శ్రీలీల కెరీర్ కు ఇక గుడ్ ..? తల్లితో కలిసి భారీ స్కెచ్ వేసిన టాలీవుడ్ బ్యూటీ..?

గత రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట. దాంతో ఆయన కాస్త అస్వస్థతకి లోనయినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇప్పుడు ప్లాన్ చేసుకున్న తన పొలిటికల్ రిలేటెడ్ పనుల్లో కూడా చురుగ్గా పాల్గొనక పోవచ్చని అంటున్నారు. ఆయన ట్రీట్మెంట్ తీసుకుని కాస్త రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆయన ఎక్కువరోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు. పొలిటికల్ గా బాగా బిజీగా ఉండటంతో.. వరుస షెడ్యూల్స్ నుప్లాన్ చేసుకన్నారు పవన్. 

ఇక తన షూటింగ్స్ విషయానికి వస్తే..పవర్ స్టార్ తన సినిమాల షూటింగ్ లు అన్నీ కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం. ఎలక్షన్స్ టైమ్ దగ్గర పడుతుండటంతో.. ఎలక్షన్స్ తరువాత పవన్ షూటింగ్స్ స్టార్ట్ చేస్తారని సమాచారం. పవర్ స్టార్ కంప్లీట్ చేయాల్సిన సినిమాలలో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి.