సినిమాల విషయంలో దూకుడు పెంచాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పాలిటిక్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చి.. ఇక సినిమాల పనిచూడబోతున్నారు. ముఖ్యంగా హరిహరవీరమల్లు విషయంలో ఓనిర్ణయానికి వచ్చాడట పవన్.
పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు బ్యాలన్స్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి.. టైమ్ ఉన్నప్పుడు షూటింగ్ కు వచ్చి వెళ్తుంటారు. ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంత ప్రెజర్ లో కూడా నెక్ట్స్ మన్త్ అంతా షూటింగ్స్ కు కేటాయించారట పవర్ స్టార్. ఇప్పటికే ఎప్పుడో స్టార్ట్ అయిన హరిహరమల్లు.. నాలుగైదేళ్ళక్రితం కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేయాల్సి ఉంది. అవి అలా పెట్టి.. రీసెంట్ గా ఒప్పుకున్న వినోదయ సీతం కంప్లీట్ చేశాడు పవన్. దాంతో హరిహరవీరమల్లు పరిస్థితి ఏంటీ అని అడుగుతున్నారు ఫ్యాన్స్.
ఇక హరీహరవీరమల్లుతో.. దసరా రిలీజ్ వైపుగా అడుగులు వేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతుంది. అయితే కోవిడ్ లాంటి కొన్ని కారణాల వల్ల షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా జరగలేదు. ఈలోపు పవర్ స్టార్ పొలిటికల్ గా బాగాయాక్టీవ్ అవ్వడంతో సినిమా అలా ఆగిపోయింది. భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈసినిమా కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసి సెట్స్ వేశారు. అవి కూడా అలా ఖాళీగా ఉంటున్నాయి. దాంతో ఈసినిమాను ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని పక్కా ప్లాన్ చేసుకున్నాడట పవర్ స్టార్. ఏప్రిల్ లో ఎక్కువ రజులు ఈసినిమా షూటింగ్ కు కేటాయించబోతున్నాడట. ఇప్పటికే దాదాపు 65 శాతం షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ఈసారి ఎలాగైనా టాకీ పార్ట్ పూర్తి చేయాలి అని పక్కాగాప్లాన్ చేసుకున్నాడట. ఈ మూవీ కాస్త డిఫరెంట్ కావడంతో.. ఈసినిమాకు టైమ్ కాస్త ఎక్కువగా పడుతుంది. పవర్ డేట్స్ కూడా ఎక్కువ అవసరం అవుతాయి. అందులోను.. అప్పుడు కొంత ..ఇప్పుడు కొంత అంటూ.. 65 శాతం సినిమా కంప్లీట్ చేశాడు క్రిష్.
ఇక మిగిలినదికూడా త్వరగా కప్లీట్ చేయాలని చూస్తున్నాడు. అటు పవన్ కూడా ఈసారి హరిహరవీరమల్లు సినిమాకోసం ఎక్కువగా డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారట. ఈ ఏప్రిల్ అంతా తన టైమ్ ను సినిమాలకు కేటాయించాలని నిర్ణయించాడట పవర్ స్టార్. అసలు అన్నీ కుదిరితే.. హరిహరవీరమల్లు సినిమాను ఈ ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని అది కుదరలేదు. దాంతో ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చాలా కాలంగా నాన్చుతూ వస్తున్నాడు పవర్ స్టార్. ఏప్రిల్ లో ఈసినిమా కోసం 10 రోజులు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. మరో వైపు సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా చేయాల్సి ఉంది పవర్ స్టార్. ఇటు వీనోదయ సీతం షూటింగ్ ఆల్ రెడీ పూర్తి చేశాడు.. దాంతో.. అటు సుజిత్ తో కమిట్ అయిన సినిమా కూడా ఈ నెలలోనే ఓపెనింగ్ జరుపుకోబోతున్నట్టుసమాచారం.
