పవన్ లేకున్నా ఆగని షూటింగ్, ఓజి కోసం సుజిత్ మార్క్ ఫార్ములా...
OG షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు డైరెక్టర్ సుజిత్ కుమార్. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ లేకున్నా.. తన మార్క్ డైరెక్షన్ తో షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న సినిమా ఓజి. సాహో లాంటి భారీ సినిమాలు తెరకెక్కించిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఓజి. ఈసినిమాపై పవన్ కళ్యాణ్ ప్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పోలిటిక్స్ లో బిజీ అయిపోగా.. షూటింగ్ ను మాత్రం పరుగులు పెట్టిస్తున్నాడు.
ప్రస్తుతం పవర్ స్టార్ లేకపోయినా.. ఆయన లేని పోర్షన్ షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాన్ తో కాంబినేషన్ సీన్స్ ఉన్న ఆర్టిస్ట్ ల సీన్లు కూడా కంప్లీట్ చేస్తున్నాడు సుజిత్. పలన్ లేకపోయినా.. వాళ్లకు సబంధించిన ఎక్స్ ప్రెషన్స్ ను ముందే క్యాప్చర్ చేసుకుంటున్నాడు సుజిత్. ఈసినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
పవన్ షూట్ ప్రెజెన్స్ లో లేకపోయినప్పటికీ పవన్ కి సంబంధించి ఇతర నటులతో అదిరే సీక్వెన్స్ లను సుజీత్ తెరకెక్కిస్తున్నాడట. పవన్ పై ఇతర ముఖ్య నటులు ఈ సినిమాలో ఇచ్చే ఎలివేషన్స్ అదిరిపోతాయని వాటిని సుజీత్ సాలిడ్ గా హ్యాండిల్ చేస్తున్నాడని ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. మొత్తానికి అయితే ఒక పవర్ ప్యాకెడ్ గా ఈ సినిమాను సుజీత్ డిజైన్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ చేశాడు సుజిత్. ఇక పవర్ స్టార్ డేట్స్ ఇస్తే.. బ్యాలన్స్ షూటింగ్ కూడా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈమూవీకి పవర్ స్టార్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో చూడాలి.