అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలు రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ.. బిజీ అయిపోయాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఆయన అంత బిజీగా ఉన్నా కాని .. తన సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.  

వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పాలిటిక్స్ లో బిజీగా ఉన్నా కాని.. వరుస సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. అంతే కాదు.. అటు షూటింగ్స్.. ఇటు పొలిటికల్ టూర్లతో .. పవర్ స్టార్ యమా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలలో ఓజీ కూడా ఒకటి. సాహో డైరెక్టర్ సుజిత్ కలయికలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ మూవీ OG. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికి మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా దాదాపు 50 శాతం పైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. 

ప్రస్తుతం ఈ మూవీ నాలుగో షెడ్యూల్ షూటింగ్ బిజీలో ఉన్నారుటీమ్. సుజిత్ చాలా తెలివిగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. మొన్నటి వరకు పవన్ లేకుండానే.. ఆయనతో కాంబినేషన్ సీన్స్ పెండింగ్ ఉన్న ఆర్టిస్ట్ ల షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఈ షెడ్యూల్ షూటింగ్ అంతా పవన్ లేకుండానే జరుగుతూ వచ్చింది. తాజాగా పవన్ కూడా ఈ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Scroll to load tweet…

ఈ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. అందులో పవన్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ కనిపిస్తున్నాడు. ఈ పిక్స్ చూసిన పవన్ అభిమానులు మూవీ పై అంచనాలు మరింత పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల పవన్ ఇలా మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న మూవీ స్టిల్స్ బయటకి వచ్చాయి. వాటిలో పవన్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా...బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించబోతున్నాడు. అర్జున్ దాస్, శ్రియారెడ్డి ప్రధాన పాత్రలు కనిపించబోతున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా 90 స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఏపీ ఎలక్షన్స్ బట్టి ఈ మూవీ రిలీజ్ ఆధారపడి ఉంది.