పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బద్రి సినిమా రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశ ఎదురయ్యింది. ఈమూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తూ ప్రకటన రిలీజ్ చేశారు టీమ్. మరి ఎప్పుడు రిలీజ్ కాబోతోందంటే..?
స్టార్ హీరోల పాత సినిమాలకు మహర్ధశ వచ్చింది. ఏదో ఒక అకేషన్ చూసుకుని... ట్రెండ్ మార్క్ మూవీస్ ను మళ్లీ థియేటర్ లో చూసే అవకాశం కలుగుతోంది అభిమానులకు. అప్పటి సినిమాలను డిజిటల్‌లోకి కన్వర్షన్ చేయించి పాత చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు మరో క్రేజీ ఫిలిం రీ రిలీజ్ కానుంది.. పవర్ స్టార్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ బద్రి.. థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది.
పవన్ కళ్యాణ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం బద్రి రీ రిలీజ్ చేయడానికి ఇటీవల డేట్ ని అనౌన్స్ చేశారు.రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఇప్పుడు డేట్ చేంజ్ అయ్యిందట. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. వచ్చే నెల అంటే పిబ్రవరి 4న ఈ మూవీ రీ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
22 సంవత్సరాల తరువాత పవర్ స్టార్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా బద్రి సినిమాను సిల్వర్ స్క్రీన్ మీద చూసే అవకాశం కల్పించబోతున్నారు. ముఖ్యంగా దర్శకుడిగా పూరి జగన్నాథ్ కు ఇది ఫస్ట్ మూవీ. మిలీనియం ఇయర్ లో వచ్చిన అద్బుతమైన సినిమాల్లో ఇది ఒకటి. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.. విజయలక్ష్మీ మూవీస్ బ్యానర్ మీద సీనియర్ ప్రొడ్యూసర్ టి. త్రివిక్రమ రావు నిర్మించగా.. అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించారు. రాక్ స్టార్ రమణ గోకుల మ్యూజిక్ సెన్సేషన్ అయింది.
2000 ఏప్రిల్ 20న రిలీజ్ అయిన బద్రి సినిమాను అప్పుడు స్క్రీన్ మీద చూడలేని వారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తరువాత ఏర్పడిన థియేటర్లు, వాటి స్క్రీన్ ల మీద చూసి ఎంజాయ్ చేయబోతున్నారు. అంతే కాదు పవర్ స్టార్ అభిమానుల కోరిక మేరకు రీ మాస్టర్డ్ వెర్షన్ రెడీ చేస్తున్నారు. 4 K, డీటీఎస్, క్యూబ్ లాంటి వాటితో సినిమాను రీ ఎడిట్ చేసి.. కొత్త హంగులు అద్దుతున్నారు.
