Asianet News TeluguAsianet News Telugu

బోయపాటిని ఉతికి ఆరేసిన పోసాని

  • తెలుగు సినీ అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఎదిగిన బోయపాటి
  • గతంలో పోసాని దగ్గర అసిస్టెంట్-గా పనిచేసిన బోయపాటి
  • బోయపాటి తన వాడనుకుంటే చీప్ గా ప్రవర్తించాడంటున్న పోసాని
posani slams boyapati srinu

 

పోసాని కృష్ణమురళి ఈ మధ్య ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీనుకు లెఫ్ట్ రైట్ ఇచ్చారు. తన వద్ద అసిస్టెంటుగా పనిచేసిన బోయపాటి తాను ఇంట్లో లేని సమయంలో తన భార్య వద్దకు వచ్చి అవమానకరంగా మాట్లాడాడని ఆరోపించారు.

గతంలో బోయపాటి శీను జీవితం ఏంటో, తాను ఎక్కడి నుంచి వచ్చాడో మరచిపోయి.. ప్రవర్తించాడని పోసాని వాపోయారు. బోయపాటి శ్రీను అనే వాడు చాలా చాలా చాలా పేదవాడు. ఒక చిన్న పూరి గుడిసె మాత్రమే ఉండేది. అతన్ని తీసుకువెళ్ళి ముత్యాల సుబ్బయ్య దగ్గరకు తీసుకువెళ్లి… నాకు తమ్ముడు అవుతాడు… నా ముఖం చూసి అవకాశం ఇమ్మంటే… ఏమయ్యా నువ్వు ఇట్లాంటివి భలే చెప్తావ్ అని ముత్యాల సుబ్బయ్య.. మరోసారి విజ్ఞప్తి చేసానని చెప్పుకొచ్చారు పోసాని. ఒక సినిమా అయిపోగానే వదిలిపెట్టవద్దు… పదేళ్ళ పాటు మీ దగ్గర ఉంచుకోండి, వాడు డైరెక్టర్ అయ్యే దాకా చూడండి అని దండం పెట్టి నా వ్యక్తిగత విజ్ఞప్తిగా చెప్తే… ముత్యాల సుబ్బయ్య పదేళ్ళ పాటు పోషించారని చెప్పారు. మరి బోయపాటి కోసం ఇంత చేసిన పోసాని ఇప్పుడు ఫైర్ అవటాననికి కారణమేంటి..

 

పోసాని డైరెక్టర్ గా మారి ‘శ్రావణమాసం’ అనే సినిమా తీశారు. ఆమూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సందర్భంలో పోసాని ఇంట్లో లేని సమయంలో వచ్చిన బోయపాటి… ‘వదినా… నేనంటే సినిమా డైరక్షన్ డిపార్టుమెంటులో ఉన్నాం, అన్నయ్య లేడు కదా అందుకే సినిమా పోయింది… అయ్యో రేపట్నుంచి ఇన్సూరెన్సు కట్టాలన్నా, డ్రైవర్ జీతాలు ఇవ్వాలన్నా, ఎలా కట్టగలుగుతారు’ అని బోయపాటి శ్రీను అవహేళనన చేశాడని..పోసాని వాపోయారు.posani slams boyapati srinu

ఇదే బోయపాటి శీను గతంలో పోసాని ఇంటి తలుపు దగ్గర పెద్ద పెద్దగా ఏడుస్తుంటే..., నా భార్య వెళ్లి ఏంటయ్యా శ్రీను అంటే… చేతులు రెండు కట్టుకుని, ఏడుస్తూ… వదినా… మా ఆవిడకు బాలేదు, పిల్లోడు పుట్టాడు వాడికి సీరియస్ గా ఉంది, హాస్పిటల్ కు వెళ్ళాలి డబ్బులు లేవు అంటే… నువ్వు ఏడవకురా… నీకు ఎంత కావాలో వదినను అడిగి తీసుకువెళ్ళు, హాస్పిటల్ బిల్లు మొత్తం ఇస్తాం… నేనున్నాను కదరా… ఎందుకు బాధపడతావు అని ధైర్యం చెప్పానని పోసాని చెప్పారు. హాస్పిటల్ బిల్లు మొత్తం తన భార్యే కట్టిందన్నారు. అలాంటి బోయపాటి శ్రీను తన భార్య వద్దకు వచ్చి అలా బిహేవ్ చేయవచ్చా…? అసలు వాడికి నాకు పోటీ ఏంటి? వాడిది సానుభూతి కాదుగా, చీప్ బిహేవియర్, ఆరోగేన్స్, ఏదైతే నేను హెల్ప్ చేసానో అదే నా బాధ. ఏ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రవర్తించలేదే, కొరటాల శివ, సంపత్ నంది ప్రవర్తించలేదే… ఇండస్ట్రీలో ఎవరూ ఇలా మాట్లాడలేదే… ఆ బాధ తప్ప వాడి మీద నాకు ఎందుకు ఉంటుంది బాధ అంటూ… వివరించిన పోసాని వ్యాఖ్యలతో బోయపాటికి ఫుల్ డ్యామేజ్ అవుతోంది.

గతంలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తీసిన “సింహా” సినిమా సందర్భంలో జరిగిన కథ కూడా కొరటాల శివ ఇటీవల బయటపెట్టిన సంగతి తెలిసిందే. ‘సింహా’ సినిమాకు కథ, మాటలు అందించిన కొరటాల పేరు టైటిల్ కార్డ్స్ లో వేయకుండా, తానే అందించినట్లుగా మొత్తం బోయపాటి పేరు వేయడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇలా బోయపాటి శ్రీను ‘కేరెక్టర్’ గురించి విని అంతా అవాక్కవుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios