రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నిత్యం ఏదొక కామెంట్ చేస్తూనే ఉన్నాడు. వైసీపీకి తన మద్దతు పలికిన ఈ నటుడు మిగిలిన పార్టీలను ఏకిపారేస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ పై పోసాని ఫైర్ అయ్యారు.

ఇటీవల పవన్ తెలంగాణా.. పాకిస్తాన్ లా మారిందని ఏపీ ప్రజలపై తెలంగాణాలో దాడు చేస్తున్నారని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలను ఖండించిన పోసాని.. రాజకీయ అవసరాల కోసం అంధ్ర, తెలంగాణా ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దని.. ఆంధ్రులు తెలంగాణాలో ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నారని అన్నారు.

ఇక పవన్, చిరుల మధ్య బంధం గురించి మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీ విషయంలో పవన్.. చిరుకి అన్యాయం చేశాడని అన్నారు. ప్రజారాజ్యం రాజకీయాల్లో ఫెయిల్ అయిన తరువాత పవన్ ముందుగా ఆ పార్టీని వదిలేసి వెళ్లిపోయాడని, నాగబాబు సైతం చిరుని ఆ సమయంలో వదిలేశాడని ఆరోపణలు చేశారు. కానీ ప్రజారాజ్యం.. కాంగ్రెస్ లో విలీనం అయినంతవరకు తాను పార్టీని, చిరుని విడిచిపెట్టలేదని పోసాని అన్నారు.

ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయినందున చిరంజీవి ఎంతో ఆవేదన చెందారని తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం తట్టుకోలేక చిరంజీవి తనకు ఫోన్ చేసి ఏడ్చినట్లు గుర్తు చేసుకున్నాడు పోసాని. సొంత అన్నయ్యనే మధ్యలో వదిలేశాడని పవన్ పై విమర్శలు గుప్పించారు.