ప్రత్యేకహోదా పోరుకు సినిమా వాళ్లు ముందుకు రావడం లేదు.. అని అంటూ టీడీపీ ఎమ్మెల్సీ వై.రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యానాలపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మరోసారి ధ్వజమెత్తారు. సినిమా వాళ్ల గురించి టీడీపీ ఎమ్మెల్సీ అనుచితంగా మాట్లాడారు.. అని ధ్వజమెత్తుతూ పోసాని హాట్ కామెంట్స్ చేశాడు. ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోసాని తీవ్రమైనా కామెంట్లు చేశారు.

 


ప్రత్యేకించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ పై పోసాని తీవ్రమైన విమర్శలు చేశారు. సినిమా వాళ్ల గురించి రాజేంద్రప్రసాద్ అనుచితంగా మాట్లాడారని, సినిమా వాళ్లను తాగుబోతులు, తిరుగుబోతులుగా అభివర్ణించారని.. అయితే ఆ లక్షణాలు అన్నీ నారా లోకేష్ లో ఉన్నాయని పోసాని అన్నారు.అందుకు సంబంధించి కొన్ని ఫొటోలను చూపిస్తూ.. పోసాని విరుచుకుపడ్డారు. ‘నారా లోకేష్ అమ్మాయిలతో కలిసి మందేస్తాడు..అతడికి అబ్బాయిలతో కాదు, అమ్మాయిలతోనే స్నేహం. వాళ్లతో కలిసి అతడు పాలు తాగ లేదు...మందుతాగాడు, స్విమ్ సూట్లలోని అమ్మాయిలతో కలిసి లోకేష్ ఈత కొట్టాడు.. బికినీలు వేసుకున్న అమ్మాయిలతో క్లోజ్ గా ఫొటోలు దిగాడు.. ఫొటోల్లో ఉన్నది నారా లోకేష్ భార్య కాదు కదా.. వాళ్లంతా గర్ల్ ఫ్రెండ్స్, లోకేష్ అమ్మాయిల నడుము కొలతలు చూస్తాడు, లోకేష్ తో పోలిస్తే ఇలాంటి పనుల్లో సినిమా వాళ్లం చిన్న పిల్లలం.. మాట్లాడేముందు సిగ్గుండాలి...’ అని అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పోసాని. ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలను చూపిస్తూ పోసాని ఈ హాట్ కామెంట్స్ చేశారు.