పోసాని కృష్ణ మురళి చాలా రోజుల తరువాత ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో వైఎస్.జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతూ అధికారపార్టీపై విమర్శల బాణాలను వదులుతున్న పోసాని కొన్ని రోజుల క్రితం ఒక సినిమాను మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి ఆ సినిమా తెరకెక్కిందని టాక్ వస్తోంది. 

ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే.. 'ముఖ్యమంత్రి గారు.. మీరు మాటిచ్చారు' అని సెట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేస్తూ సినిమాను రూపొందిస్తున్నట్లు టాక్ వచ్చింది. అయితే వారిని ఏ విధంగా సినిమాలో టార్గెట్ చేయలేదని దర్శకుడు పోసాని చెబుతున్నప్పటికీ ఈ సినిమా పొలిటికల్ మూమెంట్ లో వివాదం కానుందని రూమర్స్ వస్తున్నాయి. 

అలీ - బాబు మోహన్ ప్రధాన పాత్రలో తెరక్కుతున్న ఈ సినిమాను  గోల్డెన్‌ఎర ప్రొడక్షన్‌ నెంబర్‌-1 లో నిర్మాత శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. జనవరిలో మొదలైన ఈ సినిమాను పులివెందుల సమీప ప్రాంతాల్లోనే ఎక్కువగా షూటింగ్ జరిపారు. ఇక వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి మరో 10 రోజుల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారు.. ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని సారూ ఇప్పుడు ఏ విధంగా ఏపి రాజకీయాలను మలుపుతిప్పే సినిమా చేస్తారో చూడాలి.