దర్శకుడిగా మారుతున్న స్టార్‌ విలన్‌.. పెద్ద బ్యానర్‌లో సినిమా..? హీరో ఎవరంటే?

విలన్‌ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు సుప్రీత్‌రెడ్డి. తనకంటూ ఓ గుర్తంపు తెచ్చకున్నాడు, ఆర్టిస్టుగా మెప్పించిన ఆయన ఇప్పుడు సరికొత్తగా కనిపించబోతున్నారు. 

populer villian supreeth reddy turn as a director with star hero arj

సినిమా పరిశ్రమలో చాలా మార్పులు వస్తున్నాయి. చాలా మంది ఆర్టిస్టులు క్రియేటివ్‌ సైడ్‌ వెళ్తున్నారు. ఆ మధ్య కమెడియన్‌ వేణు `బలగం`తో దర్శకుడిగా మారి సంచలనం సృష్టించారు. అలాగే `నా సామిరంగ`తో కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకుడిగా మారి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు మరో ఆర్టిస్ట్ దర్శకుడిగా మారుతున్నారు. విలన్‌ పాత్రలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న సుప్రీత్‌ రెడ్డి ఇప్పుడు దర్శకుడిగా మారుతుండటం విశేషం. 

విలన్‌ పాత్రలతో టాలీవుడ్‌లో విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు సుప్రీత్‌ రెడ్డి. ఓ రకంగా స్టార్‌ విలన్‌గానూ మెప్పించారు. `ఛత్రపతి`, `మర్యాద రామన్న`, `సై`, `బిల్లా`, `అదుర్స్`, `బృందావనం`, `దూకుడు`, `నిప్పు`, `మిర్చి`, `బలుపు`, `బాద్షా`, `సరైనోడు`, `సామో` చిత్రాల్లో నటించారు. గత నాలుగేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. 

ఈ నేపథ్యంలో తన క్రియేటివ్‌ సైడ్‌ని ఓపెన్‌ చేస్తున్నారు. కథలు సిద్దం చేసే పనిలో ఉన్నారట. నటుడిగా కాకుండా వెండితెరపై క్రియేటర్‌గా సత్తా చాటాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకుడిగా మారే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఓ సినిమా కూడా ఓకే అయ్యిందట. `యూవీ` వంటి పెద్ద బ్యానర్‌లోనే సినిమా చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారని సమాచారం. కథ ఓకే అయ్యిందని తెలుస్తుంది. 

ఇందులో నాని హీరోగా నటిస్తారని తెలుస్తుంది. నానికి ఈ కథ బాగా నచ్చిందని, దీంతో ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం నాని `సరిపోదా శనివారం` చిత్రంలో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న విభిన్న కథా చిత్రమిది. యాక్షన్‌, రా అండ్ రస్టిక్‌ కథాంశంతో రాబోతుంది. ఆ తర్వాత `బలగం` వేణు దర్శకత్వంలో సినిమా అనుకున్నారట. ఆ తర్వాత సుప్రీత్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios