శ్రీరెడ్డికి ఛాన్స్ ఇస్తా.. నిర్మాత ఆఫర్!

Popular producer makes an offer to Sri Reddy
Highlights

బాలనటిగా సినిమా రంగానికి పరిచయమైన పద్మిని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించారు. తెలుగులో పాతికకు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సీరియల్, వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి టాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అప్పుడు కోలీవుడ్ కు వెళ్లి అక్కడ రచ్చ చేయడం మొదలుపెట్టింది. ఆమెపై తగిన చర్యలు తీసుకునే విధంగా నడిగర్ సంఘం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు నటిగా అవకాశాలు దొరకడం కష్టమే.. మనకెందుకులే అని దర్శకనిర్మాతలు కూడా లైట్ తీసుకున్న ఈ భామకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తానని చెబుతున్నారు ఓ నిర్మాత.

ఆ నిర్మాత మరెవరో కాదు.. ప్రముఖ నటి కుట్టి పద్మిని. బాలనటిగా సినిమా రంగానికి పరిచయమైన పద్మిని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించారు. తెలుగులో పాతికకు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సీరియల్, వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆమె తన సీరియల్, వెబ్ సిరీర్ లలో శ్రీరెడ్డికి అవకాశం ఇస్తానని చెప్పడం విశేషం.

ఇటీవల చెన్నైకి వెళ్లిన శ్రీరెడ్డి అక్కడ ప్రముఖులపై చేస్తోన్న వ్యాఖ్యలు కొందరు సినీపెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించాయి.   ఈ విషయమై కుట్టి పద్మిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోలీవుడ్ లో 1983 నుండి వేధింపులు మొదలయ్యాయి. చాలా మంది అమ్మాయిలు అవకాశాల కోసం ఇందులో చిక్కుకునేవారు. ఒకరిద్దరు మోసం చేసినప్పుడే శ్రీరెడ్డి జాగ్రత్త పడాల్సింది. మిగతావారికి అవకాశం ఇచ్చి ఉండకూడదు' అని వెల్లడించిన పద్మిని తాను నిర్మిస్తోన్న సీరియళ్లు, వెబ్ సిరీస్ లలో శ్రీరెడ్డికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దీనిపై స్పందించిన శ్రీరెడ్డి ఆమెకు సోషల్ మీడియా ద్వారా థాంక్స్ చెప్పారు.   

loader