ప్రముఖ హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్ చేసిన ట్వీట్ కి దర్శకుడు మురుగదాస్ షాకయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించాలని ఉందంటూ సోషల్ మీడియా వేదికగా డ్యూక్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

తనకు తమిళం రాదనీ, కానీ మురుగదాస్ తీస్తోన్న 'దర్బార్' సినిమాలో నటించాలనుందని అన్నారు. తను రజినీకాంత్ కి సోదరుడి పాత్రలో కానీ నయనతారకి అంకుల్ పాత్రలోనైనా నటిస్తానని కోరారు. అనిరుద్ తమలాంటి స్టార్ నటుల కోసం ఓ మంచి పాట కంపోజ్ చేస్తే బాగుందని అన్నారు.

ఈ ట్వీట్ చూసిన మురుగదాస్ 'సర్... ఇది నిజంగా మీరేనా..?' అని ప్రశించారు. దీనికి సమాధానంగా బిల్ డ్యూక్.. 'అవును సర్..' అని చెబుతూ తన మేనేజర్లు, కొందరు హాలీవుడ్ ఏజెంట్లు మురుగదాస్ వర్క్ ని ఎంతగానే ఇష్టపడతారని చెప్పారు. మీతో కలిసి పని చేస్తే అవకాశం కోసం చూస్తున్నా అంటూ మురుగదాస్ కామెంట్ కి రిప్లై ఇచ్చారు.

ఇది చూసిన రజిని ఫ్యాన్స్ తలైవా క్రేజ్ ఇదీ అంటూ మురిసిపోతున్నారు. కొందరు మాత్రం బిల్ డ్యూక్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.