ఢీ పూర్ణ ఇటీవల తల్లి అయ్యింది. ఆమె పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె తన చిన్నారిని చూసుకుంటూ మాతృత్వపు క్షణాలను అనుభవిస్తుంది. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
హాట్ హీరోయిన్, ఢీ ఫేమ్ పూర్ణ ఇటీవల తల్లి అయ్యింది. పండంటి మగబిడ్డకి ఆమె జన్మనిచ్చింది. గతేడాది కేరళాకి చెందిన దుబాయ్ బేస్డ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది చివర్లో తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన పూర్ణ.. రెండు రోజుల క్రితం మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. తన భర్త షానిద్ చిన్నారిని ఎత్తుకోగా, ఇద్దరిని హగ్ చేసుకుంటూ భర్తకి పూర్ణ ముద్దు పెడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఇప్పుడు మాతృత్వపు క్షణాలను అనుభవిస్తుంది పూర్ణ. తాను తల్లి కావడంతో చెప్పలేని, పట్టలేని ఆనందంలో ఉంది. తన ముద్దుల చిన్నారిని చూసుకుంటూ మురిసిపోతుంది. అయితే తమ చిన్నారిని తనకు చూపిస్తూ తన భర్త షానిద్ చేసిన సర్‌ప్రైజ్ అల్టీమేట్‌గా ఉండటం విశేషం. ఆసుపత్రిలోనూ బెలూన్స్ తో డెకరేట్ చేసి సింపుల్‌గా, స్విట్‌గా తన భర్త తనని సర్‌ప్రైజ్ చేయడంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది పూర్ణ. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ఇందులో పూర్ణ చెబుతూ, తన జీవితం ఇప్పుడు పరిపూర్ణమైందని, పూర్తి స్థాయి స్త్రీగా మారానని తెలిపింది. ఇది నా జీవితంలో ఊహకందని అనుభూతి, మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. తనే నా ప్రపంచం. ఇప్పుడు నేఉన తల్లిని అయ్యాను. అంతేకాదు ఇప్పుడు పరిపూర్ణమైన స్త్రీగానూ మారాను` అంటూ తన ముద్దుల కొడుకుని చూసుకుంటూ మురిసిపోతుంది పూర్ణ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి నెటిజన్లు స్పందించి పూర్ణకి విషెస్ తెలియజేస్తున్నారు.
పూర్ణ.. 2007లో `శ్రీ మహాలక్ష్మి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో శ్రీహరి సరసన నటించింది. ఇది పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత 2011లో `సీమటపాకాయ్` చిత్రంతో హిట్ కొట్టింది. రవిబాబు రూపొందించిన `అవును` చిత్రంతో బ్రేక్ అందుకుంది. ఇందులో ఘోస్ట్ చేత వేధించబడే పాత్రలో మెప్పించింది. అంతేకాదు హాట్ హీరోయిన్‌గా ఆకట్టుకుంది. ఈ సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత చేసిన `అవును2` ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
`లడ్డుబాబు`, `నువ్విలా నేనిలా`, `రాజుగారి గది`, `మామ మంచు అల్లుడు కంచు`, `జయమ్ము నిశ్చయమ్మురా`, అవంతిక`, `రాక్షసి`, `సిల్లీ ఫెలో`, `అదుగో`, `సువర్ణ సుందరి`, `పవర్ ప్లే`, `సుందరి`, `దృశ్యం2`, `అఖండ`, `తీస్ మార్ ఖాన్` చిత్రాల్లో మెరిసింది. ఇటీవల `దసరా`లోనూ విలన్‌కి భార్యగా కాసేపు కనిపించినా తన ఇంపాక్ట్ చూపించింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మరోవైపు ఈటీవీలో వచ్చే `ఢీ`షోలో జడ్జ్ గానూ చేసింది పూర్ణ. ఈ షో ఆమెకి మంచి క్రేజ్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచింది.
