బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్ కూడా ఒకప్పుడు నటిగా సినిమాలు చేశారు. 1968లో ఆమె మిస్ యంగ్ ఇండియా అవార్డు అందుకున్నారు. శత్రుఘ్న, పూనమ్ ల వివాహం జరిగి 38 ఏళ్లు అయ్యాయి.

ఇటీవల కపిల్ శర్మ టీవీ షోకి హాజరైన పూనమ్ తన జీవితంలోని పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. తాము మొదటిసారి పట్నా-ముంబై రైలు ప్రయాణంలో కలుసుకున్నామని, ఆ సమయంలో శత్రుఘ్న తనతో మాట్లాడడానికి ప్రయత్నించారని, ట్రైన్ ఒక గుహ గుండా వెళుతుండగా తన పాదాలు తాకారని తెలిపారు.

ఆ తరువాత ఏమీ మాట్లాడలేదని అన్నారు. 1980లో శత్రుఘ్న, పూనమ్ ల వివాహం జరిగింది. అయితే అప్పటికే శత్రుఘ్న, హీరోయిన్ రీనారాయ్ ల ఎఫైర్స్ గురించి వార్తలు  వస్తున్నాయి. రీనా, శత్రుఘ్నల బంధం ఏడేళ్ల పాటు సాగిందని చెబుతుంటారు. శత్రుఘ్న కూడా రీనా తన పర్సనల్ ఎఫైర్ అని, పెళ్లి తరువాత రీనాపై అభిమానం మరింత పెరిగిందని గతంలో ఓసారి చెప్పుకొచ్చాడు.

రీనా తనతో ఏడేళ్ల జీవితాన్ని పంచుకోవడం తన అదృష్టమని శత్రుఘ్న అన్నారు.దీని గురించి పూనమ్ మాట్లాడుతూ.. తనకు భర్త అఫైర్ గురించి తెలుసునని, తను వారిద్దరికీ అడ్డు రాలేదని అన్నారు. పెళ్ళైన తరువాత కూడా వారి ఎఫైర్ సాగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.