BiggBoss7: పూజా మూర్తి ఎలిమినేటెడ్.. బిగ్ బాస్ సీజన్ 7లో బిగ్ సర్ప్రైజ్, మరోసారి హౌస్ లోకి రతిక
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో నేటి ఎపిసోడ్ కలర్ ఫుల్ గా సాగుతోంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ కొనసాగుతూనే హౌస్ లో దసరా సంబరాలు ధూంధాంగా సాగాయి.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో నేటి ఎపిసోడ్ కలర్ ఫుల్ గా సాగుతోంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ కొనసాగుతూనే హౌస్ లో దసరా సంబరాలు ధూంధాంగా సాగాయి. సినీ తారల డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్నారు.
దసరా సెలెబ్రేషన్స్ లో భాగంగా హాట్ అండ్ బోల్డ్ హీరోయిన్ డింపుల్ హయతి తన స్పెషల్ డాన్స్ పెర్ఫామెన్స్ తో బిగ్ బాస్ వేదికని ఊపేసింది. కళ్ళు చెదిరే అందంతో కవ్విస్తూ డింపుల్ హయతి దన డ్యాన్స్ మూవ్స్ తో మెప్పించింది. డింపుల్ హయతి అద్భుతమైన డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా నామినేషన్స్ లో ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. చివరకి నామినేషన్స్ లో పూజా మూర్తి, భోలే మిగిలారు. ఒకరు ఎలిమినేట్ కావాలి కాబట్టి ఇద్దరి ముందు రెండు బాక్స్ లో ఉంచారు. ఆ బాక్స్ లలో ఇద్దరూ చేతులు పెట్టారు. చేతులు బయటకి తీసినప్పుడు ఎవరి చేతికి రెడ్ కలర్ ఉంటుందో వారు ఎలిమినేట్. గ్రీన్ కలర్ వచ్చిన వాళ్ళు సేఫ్.
నాగార్జున కౌంట్ డౌన్ ముగియగానే ఇద్దరూ చేతులు బయటకి తీశారు. పూజా మూర్తి చేతికి రెడ్ కలర్ అంటుకుంది. దీనితో పూజా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇంటి సభ్యుల ఆమెకి సెండాఫ్ ఇచ్చారు. దీనితో పూజా మూర్తి వేదికపై నాగార్జున వద్దకు వెళ్ళింది. ఒక్కొక్క ఇంటి సభ్యుల గురించి ఆమె తన అభిప్రాయం చెప్పింది.
ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో మరి బిగ్ సర్ప్రైజ్ చోటు చేసుకుంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రతిక మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఓటింగ్ ప్రకారం హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లే సెకండ్ ఛాన్స్ ఆమెకి దక్కింది అని నాగార్జున తెలిపారు. ఆమెకి నాగ్ స్వాగతం పలికారు. వచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ ని ఉపయోగించుకుంటానని రతిక మాట ఇచ్చింది. రతిక రెండవసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కంఫర్మ్. ఎప్పుడనేది బిగ్ బాస్ నిర్ణయిస్తారు.