Asianet News TeluguAsianet News Telugu

పూజా హెగ్డేకి ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మిస్.. మళ్ళీ కన్నడ బ్యూటీ వల్లే, టాలీవుడ్ లో డోర్స్ క్లోజ్ ?

పూజా హెగ్డేకి గత కొన్నేళ్లుగా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. డీజే తర్వాత సౌత్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే అనేక విజయాలు సొంతం చేసుకుంది. 

Pooja hegde lost one more chance in tollywood dtr
Author
First Published Jan 29, 2024, 7:53 AM IST | Last Updated Jan 29, 2024, 7:53 AM IST

పూజా హెగ్డేకి గత కొన్నేళ్లుగా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. డీజే తర్వాత సౌత్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే అనేక విజయాలు సొంతం చేసుకుంది. డీజే, అరవింద సమేత, మహర్షి, గడ్డలకొండ గణేష్, మహర్షి, అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కాయి. 

ఆ తర్వాత పూజా హెగ్డేకి బ్యాడ్ టైమే స్టార్ట్ అయింది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా ప్లాపులు ఎదురయ్యాయి. హిందీలో సల్మాన్ తో నటించిన కిసీకి భాయ్ కిసీకి జాన్ చిత్రం కూడా ఆశించిన ఫలితం రాలేదు. దీనితో పూజా హెగ్డేకి ఒక్కసారిగా దారులన్నీ మూసుకుపోయాయి. చేతిలో ఉన్న ఛాన్సులు కూడా మిస్ అయ్యాయి. అందుకు ఉదాహరణ గుంటూరు కారం చిత్రం. ఈ చిత్రంలో ముందుగా పూజా హెగ్డేనే హీరోయిన్. కానీ ఆమె ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. 

Pooja hegde lost one more chance in tollywood dtr

మరోవైపు రష్మిక నుంచి కూడా పూజా హెగ్డే పోటీ ఎదుర్కొంది. ఇప్పుడు మరో కన్నడ బ్యూటీ వల్ల పూజా హెగ్డే మరో ఆఫర్ కోల్పోయినట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో రవితేజ ఒక చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి ముందుగా పూజా హెగ్డేని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆ అవకాశం కూడా చేజారినట్లు తెలుస్తోంది. 

సప్త సాగరాలు దాటి అనే చిత్రంతో సెన్సేషన్ సృష్టించిన కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈ ఆఫర్ ని ఎగరేసుకుపోయినట్లు తెలుస్తోంది. దీనితో టాలీవుడ్ లో పూజా హెగ్డేకి ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. దీనితో నెటిజన్లు పూజా హెగ్డేకి మారో కన్నడ బ్యూటీ దెబ్బేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios