సోషల్‌ మీడియాలో సెలబ్రిటీల ఎక్కౌంట్స్ హ్యాక్‌ అవడం కొత్తేమీ కాకపోయినా, అది ఎప్పుడూ వార్తే. రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా యాక్టివ్‌గా వుండేవాళ్ళకి ఈ హ్యాకింగ్‌ పెద్ద సమస్యే. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ అక్కౌంట్లు అప్పుడప్పుడూ హ్యాక్‌ అవుతుండడం చూస్తూనే వున్నాం. అలాగే ఆ మధ్యన పవన్ ఎక్కౌంట్ సైతం హ్యాక్ అయ్యింది. తాజాగా పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్ అయింది. ఎవరో ఆమె ఎక్కౌంట్ హ్యాక్ చేసి సమంతపై పూజా హెగ్డే ఇన‌స్టాగ్రామ్ వేదికపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది పూజ అనుకుని చాలా మంది కంగారు పడ్డారు. కానీ ఆమె కాదని తర్వాత తెలిసింది. దీంతో తన ట్విట్టర్‌ ద్వారా నెటిజన్స్‌కి ఈ విషయాన్ని తెలియజేస్తూ మెసేజ్‌లు ఎవరు పంపొద్దని కోరింది.   అర్ధరాత్రి ట్విట్టర్ ద్వారా తన అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిపింది.

ఈ విషయం చెప్తూ పూజ ... తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఎలాంటి మెస్సేజ్ లు వచ్చినా సమాధానం ఇవ్వకండి అంటూ.. ఏమైనా ఇన్విటేషన్స్ పంపించినా కూడా యాక్సెప్ట్ చేయకండని తెలిపింది. అలాగే మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా చెప్పవద్దని తెలిపిన పూజా హగ్డే.. తన పర్సనల్ డిజిటల్ టీమ్ తో అకౌంట్ హ్యాక్ అయిన విషయం గురించి మాట్లాడానని, వాళ్ళు తప్పకుండా తనకు హెల్ప్ చేస్తారని వివరణ ఇచ్చింది.
 
 అయితే కొద్ది సేపటి తర్వాత డిజిటల్ టీం సాయంతో తన అకౌంట్ పునరుద్దరించారని పూజా హెగ్డే తన ట్వీట్‌ ద్వారా తెలుపుతూ, ఈ సమయంలో కష్టపడి పని చేసిన టెక్నికల్‌ టీంకి ధన్యవాదాలు తెలిపింది. చివరికి తన అకౌంట్‌ తన చేతుల్లోకి వచ్చినట్టు పేర్కొంది. హ్యాక్ అయిన సమయంలో ఉన్న పోస్ట్‌లు, మేస్సేజ్‌లని తొలగించినట్టు పేర్కొంది.