నా మిత్రుడ్ని వేధిస్తారా.. పూజాహెగ్డే ఫైర్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 11, Aug 2018, 3:01 PM IST
pooja hegde fires on british airways
Highlights

నిన్న రాత్రి బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది తన పట్ల జాతీ వివక్షను ప్రదర్శించిన విషయం నా స్నేహితుడు చెప్పాడు. అతడు కేవలం ఒక గ్లాస్ మంచి నీళ్లు అడిగితే వారు ఇవ్వకుండా రెండు గంటల పాటు వెయిట్ చేయించారు. కానీ పక్కనే ఉన్న మరో విదేశీయుడికి గ్యాప్ లేకుండా మద్యం సప్లై చేశారు

బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది భారతీయులను తక్కువగా చూస్తున్నారని ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో రిషి కపూర్ కూడా నిన్న తన సోషల్ మీడియా వేదికగా బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణించకండి అంటూ ఓ పోస్ట్ పెట్టారు. తాజాగా పూజా హెగ్డే కూడా తన స్నేహితుడు ఎదుర్కొన్న విషయాన్ని వెల్లడిస్తూ బ్రిటీష్ ఎయిర్ వేస్ పట్ల తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

'నిన్న రాత్రి బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది తన పట్ల జాతీ వివక్షను ప్రదర్శించిన విషయం నా స్నేహితుడు చెప్పాడు. అతడు కేవలం ఒక గ్లాస్ మంచి నీళ్లు అడిగితే వారు ఇవ్వకుండా రెండు గంటల పాటు వెయిట్ చేయించారు. కానీ పక్కనే ఉన్న మరో విదేశీయుడికి గ్యాప్ లేకుండా మద్యం సప్లై చేశారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది చాలా అసహ్యకరంగా ప్రవర్తించారు' అంటూ పూజా వెల్లడించింది.

ప్రస్తుతం పూజా హెగ్డే.. ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత' అనే చిత్రంలో నటిస్తోంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

loader