టెలివిజన్ సెలెబ్రిటీ పూజ గోర్ సోషల్ మీడియా వేదికగా పెద్ద బాంబ్ పేల్చారు. తన ప్రియుడు రాజ్ సింగ్ అరోరాతో బ్రేకప్ అయినట్లు ఆమె స్పష్టం చేయడం జరిగింది. దీనితో కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాలు నిజమే అని క్లారిటీ వచ్చింది. పూజ గోర్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో తన బ్రేకప్ స్టోరీ సుదీర్ఘ సందేశం ద్వారా తెలియజేశారు. పూజ గోర్ తన సందేశంలో..'' 2020 మన జీవితాల్లో పెను మార్పులు తీసుకు వచ్చింది. అందులో కొన్ని మంచి విషయాలు, కొన్ని చెడ్డ విషయాలు ఉన్నాయి. రాజ్ తో నా రిలేషన్ గురించి కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కొన్ని కఠిన నిర్ణయాలు వెంటనే తీసుకోలేం, అందుకే ఈ విషయం మీతో చెప్పడానికి నాకు కొంత సమయం పట్టింది'' అన్నారు 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja A Gor (@poojagor)

ఆమె ఇంకా తన సందేశంలో...''రాజ్ మరియు నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మా దారులు వేరు. మేము విడిపోయినా ఒకరిపై మరొకరికి గౌరవం, ప్రేమ అలానే ఉంటాయి. నా జీవితాన్నీ ఎంతో ప్రభావితం చేసిన రాజ్ సింగ్ అరోరాకు కృతజ్ఞతలు. మేము ఇద్దరం మంచి మిత్రులుగా బంధం కొనసాగిస్తాం. నా ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నా'' అని వివరించారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja A Gor (@poojagor)

ఇక పూజ గోర్ గతంలో రాజ్ సింగ్ అరోరాతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి డిలీట్ చేసినట్లు తెలుస్తుంది. 2009లో వీరిద్దరూ ప్రేమలో పడడం జరిగింది. అప్పటి నుండి దశాబ్దానికి పైగా పూజ, రాజ్ ప్రేమికులుగా ఉండడం విశేషం. మరి ఇంతటి సుదీర్ఘ సహచర్యం అనంతరం ఇప్పుడు విడిపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు. వీరి మధ్య అభిప్రాయ బేధాలు తెలెత్తగా... వాటి వెనుక కారణం ఏమిటో తెలియాల్సి వుంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja A Gor (@poojagor)