Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలకు పోలీసుల వార్నింగ్ .. ఎందుకంటే..?

సినిమా సెలబ్రిటీలు ఏం చేసినా.. జనాలు గమినస్తుంటారు. స్టార్ కాబట్టి తమ అభిమాన నటీనటులు చేసే పనులకు సంతోషపడతారు కాని.. అలా చేసే క్రమంలో వారు రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం.. అది పెద్ద వివాదమే అంతుంది. తాజాగా అమితాబ్, అనుష్క శర్మ విషయంలోనూ అదే జరిగింది. 
 

Police Take Action  To Amitabh Bachchan Anushka Sharma Without Helmet jms
Author
First Published May 16, 2023, 5:11 PM IST

ఫిల్మ్ సెలబ్రిటీలు ఏం చేసినా.. అది సామాన్యులపై ప్రభావం చూపెడుతుంది. సామాన్యులు తప్పు చేసినా తప్పించుకోవచ్చేమో కాని.. సెలబ్రిటీలు ఏచిన్న తప్పు చేసినా.. తప్పించుకోవడం అసాధ్యం సోషల్ మీడియా కళ్ళన్ని వారిపైనే ఉంటాయి.  తాజాగా పబ్లిసిటీ మత్తులో బాలీవుడ్ స్టార్స్ చేసిన పనికి... పోలీసులు సుతిమెత్తగా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. సెలబ్రిటీలు మీరు..మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి.. కాని.. మీవల్ల నలుగురు చెడిపోవద్దు కదా అంటూ.. గట్టిగా వాత పెడుతున్నా నెటిజన్లు. ఇంతకీ అసలూమయ్యిందంటే...? 

 సినిమా సెలబ్రిటీలు ఏం చేసినా.. జనాలు గమినస్తుంటారు. స్టార్ కాబట్టి తమ అభిమాన నటీనటులు చేసే పనులకు సంతోషపడతారు కాని.. అలా చేసే క్రమంలో వారు రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం.. అది పెద్ద వివాదమే అంతుంది. సామాన్యులను అయినా వదిలిపెడతారేమో కాని.. సెలబ్రిటీలకు మరో ఛాన్స్ ఉండదు.  ఇప్పుడు అమితాబ్, అనుష్క శర్మ విషయంలోనూ అదే జరిగింది. తాజాగా ఓ షూటింగ్ కి లేట్ అవుతుందని, కారులో నుంచి దిగి బైక్ పై లిఫ్ట్ అడిగి అమితాబ్ లొకేషన్ కి చేరుకున్నారు. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేశారు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. 

 మరో సందర్భంలో.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ  అనుష్క శర్మ కూడా ఇలానే హెల్మెట్ లేకుండా జర్నీ చేసింది. ఆమె కూడా బైక్ పై వెనకాల కూర్చుని వెళ్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చి.. సోషల్ మీడియాలో శేర్ చేసింది. దాంతో వీరిద్దరిపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. రెండు సందర్భాల్లోనూ అదీ కూడా అమితాబ్, అనుష్క శర్మ లాంటి స్టార్స్ నిబంధనలు అతిక్రమించే సరికి పాజిటీవ్ గా స్పందించే నెటిజన్లుే హ్యాపీ పీల్ అవుతూ.. కామెంట్లు పెట్టారు. కాని కొంత మంది నెటిజన్లు మాత్రం ఈవిషయంలో అసలు విషయాన్ని గట్టిగా పట్టుకుని... ముంబయి పోలీసులని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 

దీంతో పోలీసులు.. సదరు స్టార్ యాక్టర్స్ అయిన అమితాబ్, అనుష్కలపైన గరం అయ్యారు. ఇద్దరు స్టార్లపై  సీరియస్ అయ్యారు. నెటిజన్ల ప్రశ్నలకు బదులిస్తూ.. ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంలో పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది ఉత్కంటగా మారింది. ఒక వేళ హెల్మెట్ లేకుండా జర్నీ చేశారు కాబట్టి..  హెల్మెట్ ధరించనందుకు ఫైన్ వేసి వదిలేస్తారన్న వాదన వినిపిస్తోంది. ఇకనైనా ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీలు జాగ్రత్తగా లేకుంటే.. ఫ్యాన్స్ లో చులకన అయ్యే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios