చిక్కుల్లోహీరోయిన్ నమిత భర్త, నోటీసులిచ్చిన పోలీసులు, కారణం ఏంటంటే..?
తమిళ హాట్ హీరోయిన్ నమిత భర్త వీరేంద్ర చౌదరి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పోలీసు కేసునమోదు అవ్వడంతో పాటు.. విచారణకు రావాలంటూ.. నోటీసులు కూడా ఇచ్చారు.ఇంతకీ కారణం ఏంటంటే..?
తమిళ హాట్ హీరోయిన్ నమిత భర్త వీరేంద్ర చౌదరి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పోలీసు కేసునమోదు అవ్వడంతో పాటు.. విచారణకు రావాలంటూ.. నోటీసులు కూడా ఇచ్చారు.ఇంతకీ కారణం ఏంటంటే..?
తమిళ హీరోయిన.. హాట్ బ్యూటీ.. నమిత భర్త వీరేంద్ర చౌదరి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. తమిళనాడుకు చెందిన గోపాల్ స్వామి అనే వ్యక్తిని వీరేంద్ర మోసం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ గోపాల్‌స్వామి దగ్గర నుంచి 50 లక్షల వసూలు చేసి.. మోసం చేసిన కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి.
ఈకేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా వీరేంద్ర చౌదరితోపాటు మరో ఇద్దరు వ్యక్తులకు సేలం సెంట్రల్ క్రైమ్ బ్రాంచి సమన్లు పంపించిందని సమాచారం. ముత్తురామన్ అనే వ్యక్తి ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని అమ్మాపాళయం జాకిర్ ప్రాంతానికి చెందిన గోపాల్‌స్వామి నుంచి 50 లక్షలు తీసుకున్నాడు. కానీ ఆ పదవిని వీరేంద్ర చౌదరి ఇటీవలే చేపట్టడంతో గోపాల్‌స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ముత్తురామన్‌తోపాటు కౌల్సిల్ తమిళనాడు డిపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ దుశ్యంత్ యాదవ్‌ను అక్టోబర్ 31న అరెస్ట్ చేశారు.
వీరేంద్ర చౌదరి నమిత భర్త కావడంతో.. ఈ విషయంలో తమిళ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన నమిత.. ఆతరువాత ఐటమ్ సాంగ్స్ తో.. సెక్సీ స్టార్ గా పేరు తెచ్చింది. నమితకు తమిళనాట ఫ్యాన్స ఫాలోయింగ్ అత్యధికంగా ఉంది. ఆమెకు ఏకంగా గుడి కట్టారు ఫ్యాన్స్. ప్రస్తుతం అడపా దడపాసినిమాలు చేస్తూ.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.