ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్. భర్తకు విడాకులిచ్చి కొత్త ప్రియున్ని వెతుక్కున్న ఆమెకు.. ఈ మురిపెమ్ కూడా మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఇక రీసెంట్ గా రోడ్డు మీద ఆమె కారు చేసిన రచ్చ కు పోలీస్ లు ఫైన్ కూడా వేశారు.  

ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్. భర్తకు విడాకులిచ్చి కొత్త ప్రియున్ని వెతుక్కున్న ఆమెకు.. ఈ మురిపెమ్ కూడా మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఇక రీసెంట్ గా రోడ్డు మీద ఆమె కారు చేసిన రచ్చ కు పోలీస్ లు ఫైన్ కూడా వేశారు. 

బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్ కు ముంబై ట్రాఫిక్ పోలీసులు భారీగా ఫైన్ వేశారు. రాఖీ సావంత్ చేసిన పనికి స్థానికులు అసౌకర్యానికి గురి అవ్వడంతో పాటు.. భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఆమెపై విమర్షలు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే... ముంబయ్ లోని వెస్ట్ అంధేరీ లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో రాఖీ సావంత్ కోసం ఆమె కారు రోడ్డు మధ్యలో చాలా సేపు ఆగింది. అదే టైమ్ లో ఆమె కెమెరాలకు పోజులిస్తూ రోడ్డుపై చాలా సేపు అలా ఉండిపోయింది. దాంతో ఆ ప్రాతం అంతా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. 

అయితే ఆమె చేసిందే తప్పు.. కాని ఏమాత్రం ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ లో నిలిచిపోయి ఇబ్బంది పడుతున్న వారిని ఉద్దేశించి ఆమె అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది. నేను నిలిచిన చోట నుంచే లైన్ స్టార్ట్ అవుతోంది. ఆగండి అంటూ ఆమె కారులోకి ఎక్కివెళ్లిపోయింది. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక ఆమె చూపించిన రాష్ బిహేవియర్ తో పాటు.. ఆమె చేసిన పనికి.. రాఖీ వల్ల ట్రాఫిక్ జామ్ అయిన విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విజువల్స్ ను పోలీసులకు షేర్ చేశారు. ఈ నేపథ్యంలో, వీడియోను పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు ఆమె వాహనానికి ఈ చలాన్ విధించారు. ఓషీవారా ట్రాఫిక్ డివిజన్ సీనియర్ ఇన్స్ పెక్టర్ దిలీప్ భోస్లే మాట్లాడుతూ, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినందుకు చలాన్ విధించామని చెప్పారు.

ఈ మధ్య వరుస వివాదాలతో హాట్ టాపిక్ అవుతుంది రాఖీ సావంత్. తను ఎంతో నమ్మకంతో ప్రేమించి సర్వస్వం అనుకున్న కొత్త ప్రియుడు అదిల్ కూడా ఆమెకు హ్యాండ్ ఇవ్వడంతో ప్రస్టేషన్ లో ఉంది రాఖీ సావంత్. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో తన బాధను వెల్లిబుచ్చించి రెండు గంటలు ఏకధాటిగా ఏడ్చానంటుంది రాఖీ.