వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ఒకప్పటి హీరోయిన్‌ వనితా విజయ్‌ కుమార్‌. అలనాటి అందాల తార మంజుల, సీనియర్ నటుడు విజయ్‌ కుమార్‌ల పెద్ద కుమార్తె వనిత. తరుచూ వివాదాల్లో ఉండే ఈ భామ తాజాగా మూడో వివాహం చేసుకుంది. ప్రముఖ విజువల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాల్‌ను క్రిస్టియన్‌ సాంప్రదాయ పద్దతిలో ఈ నెల 27న వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వనితా, పీటర్‌ల వివాహం జరిగింది. పెళ్లి ఫోటోల్లో లిప్‌ లాక్‌ ఫోటోను కూడా షేర్‌ చేయటం చర్చనీయాంశం అయ్యింది. అయితే వీరి పెళ్లి జరిగిన తరువాత రోజు కొత్త జంట మీద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. వనితా మూడో భర్త పీటర్‌,  మొదటి భార్య హెలన్‌ ఈ జంట మీద కంప్లయింట్‌ ఇచ్చినట్టుగా కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్‌ పాల్‌ మరో వివాహం చేసుకున్నాడని పేర్కొంటూ కొత్త జంట మీద ఎలిజిబెత్‌ హెలెన్‌ కేసు వేసింది. దీంతో కొత్త జంటకు తొలి రోజు నుంచే సమస్యలు ఎదురయ్యాయంటున్నారు కోలీవుడ్  జనాలు. ఈ విషయంపై వనితా, పీటర్‌ దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.