ఈ సినిమాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయుష్ గోయల్ ఆకాశానికెత్తేయడం హాట్ టాపిక్ అయింది.
గత పది రోజులుగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) హాట్ టాపిక్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై రాజకీయ నేతలు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన నాటి నుంచి వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. దీంతో ఇప్పుడు RRR సినిమా కలెక్షన్స్ పై ఏకంగా ప్రముఖ కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ... `ఆర్ ఆర్ ఆర్` సినిమా వసూళ్ల తో రికార్డులు సృష్టించినట్లే భారత ఆర్ధిక వ్యవస్థ కూడా రానున్న రోజుల్లో రికార్డు సృష్టిస్తుందని జోస్యం చెప్పారు. `ఆర్ ఆర్ ఆర్` సినిమా 750 కోట్లు వసూళ్లు సాధించిందని తాను కూడా విన్నానని.. అదే విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు పియూష్. 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఎగుమతి సంఖ్య $418 బిలియన్లకు చేరుకోవడంపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హర్షం ఆనందం చేసారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి రూ. 750 కోట్లు వసూళ్ళు రాబట్టిన ఈ సినిమా బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమాల్ని దాటేస్తూ .. రూ. 200 కోట్లు వసూళ్ళ దిశగా దూసుకుపోతోంది. అలాగే మిగిలిన భాషల్లోనూ ఈ సినిమా సత్తా చాటుకుంటోంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఎందరో సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఈ సినిమాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయుష్ గోయల్ ఆకాశానికెత్తేయడం హాట్ టాపిక్ అయింది.
ఎన్టీఆర్ (NTR) ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది.
