శ్రీనివాస కల్యాణం’ తర్వాత నితిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రానికి ‘సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అనేది  ట్యాగ్ లైన్.  వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న... ఈ సినిమాలో రష్మిక హీరోయిన్  పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.  ఈ నేపధ్యంలో నితిన్ లుక్, గెటప్ ఎలా ఉంటుందనేది ఆయన అభిమానుల్లో  ఆసక్తికరమైన చర్చగా మారింది.  

ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్న ఫొటో ఆ సినిమాలోదే. రీసెంట్ గా లీకై మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఈ లుక్ లో నితిన్ చాలా స్మార్ట్ గా  మాంచి ఫిట్ నెస్ తో కనిపిస్తున్నారు. అలాగే కాస్త స్లిమ్ అయ్యిన నితిన్..  క్లాస్ టచ్ తో ఇరగదీస్తున్నారు.  సినిమాలో ఓ కాన్ఫిరెన్స్ సీన్ కు సంభందించిన సీన్ లో నితిన్ స్పీచ్ ఇస్తున్నప్పుడుది అని అర్దమవుతోంది.

ఈ చిత్రంలో అభినవ భీష్ముడిలా కనిపించబోతున్నారు నితిన్. మదినిండా అమ్మాయిల తలపులతో ఉండే ఈ మోడ్రన్ భీష్ముడు.. పెళ్లికి మాత్రం ససేమిరా అనే కథా నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉండబోతుందట. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ కొడుకు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. 

నితిన్‌ గత ఏడాది ‘ఛల్‌ మోహన్‌రంగ’, ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రష్మిక నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. మరోపక్క ఆమె కార్తికి జోడీగా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు.