Asianet News TeluguAsianet News Telugu

‘సర్కారు వారి పాట’, `పుష్ప`: లీక్ చేసిన వ్యక్తి ఒకరేనా? దొరికేసారా?.. అప్‌ఢేట్‌ ఏంటి?

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. లీక్ చేసిన వారిని వదలరాదని, షూటింగ్ స్పాట్ కు, ఎడిటింగ్ రూమ్ కు ఎవరినీ ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతించవద్దని చిత్రయూనిట్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.  

Person behind Pushpa, Sarkaru Vaari Paata leaks found?
Author
Hyderabad, First Published Aug 18, 2021, 7:43 AM IST

ల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. రెండు భాగాలుగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఊహించని విధంగా ‘పుష్ప’ చిత్రాన్ని లీకుల సమస్య మొదలైంది. రీసెంట్ గా ఈ చిత్రంలోని ‘దాక్కో దాక్కో మేక’ పాట విడుదలకు ముందే  సోషల్‌ మీడియాలో కనపడి షాక్ ఇచ్చింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. 

అదే పరిస్దితి సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి విడుదల చేసిన ‘బ్లాస్టర్‌’ టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ టైమ్ లోనే యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తూ అత్యధిక వ్యూస్ రాబట్టుకొంటుంది. ఇదిలావుంటే, ఈ టీజర్ దాదాపు తొమ్మిది గంటలు ముందుగానే అర్ధరాత్రి ఆన్లైన్ లో దర్శనం ఇచ్చింది. విడుదల సమయానికి కంటే ముందే అభిమానులందరికి చేరిపోవడంతో చిత్రయూనిట్ అంత కంగుతిన్నారు.   దీంతో చేసేది ఏమిలేక ‘సర్కారు వారి పాట’ టీజర్ ను ముందుగానే విడుదల చేయాల్సివచ్చింది. అయితే దీనిపై చిత్రయూనిట్ సీరియస్ గా వుంది. ఇంటి దొంగలే పనే.. అంటూ అన్వేషణ మొదలుపెట్టింది. ఈమేరకు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసారు.

ఇలా ఒకే బ్యానర్ నుంచి వస్తున్న రెండు సినిమాల ఫుటేజీ లీక్ కావటంతో నిర్మాతలు ఈ విషయమై దృష్టి పెట్టారు. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో ఆ లీక్ వీరులు ఎవరనేది దొరికారా అనే విషయం ఆసక్తికరంగా మారింది.  ఈ లోగా ఆ వ్యక్తి దొరికేసాడంటూ ఆన్ లైన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలను బట్టి...అదే సంస్దలో చాలా కాలం నుంచి కీ పొజీషన్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఈ లీక్ లకు కారణం అని తేలిందిట. ప్రొడక్షన్ హౌస్ హెడ్ పై ఉన్న కోపంతో ఇలా చేసాడని చెప్పుకుంటున్నారు.  మైత్రీ మూవీస్ వారు ఫలానా వ్యక్తే కారణం అని తెలిసి షాక్ అయ్యారట. దాంతో అతనికి వార్నింగ్ ఇచ్చి విధులనుంచి తప్పించారని అంటున్నారు. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై అధికారిక ప్రకటన ఏమీ లేదు.

 మరో ప్రక్క ఈ లీక్ విషయం తెలిసిన హీరో అల్లు అర్జున్‌ ఆశ్చర్యపోయారట. లీక్‌ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో షూటింగ్ సమయంలోనే కాదు, ఎడిటింగ్‌ రూమ్‌లోకి కూడా మొబైల్‌ ఫోన్లను అనుమతించవద్దని చిత్ర బృందాన్ని ఆదేశించారట. లీక్‌ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అన్నారట.

దీనిపై మైత్రీ మూవీ మేకర్స్‌ చిత్ర టీమ్ స్పందించింది ‘‘సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలు లీక్‌ అవ్వడం మమ్మల్ని బాధించింది. అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిందితులను కచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇంకొక విషయమేంటంటే, దయ చేసి ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దు. తర్వాత చాలా ఇబ్బందుల్లో పడతారు. ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తేనే కిక్‌ ఉంటుంది. ముందుగా వస్తే దాని విలువ తెలియదు. తాజా ఘటనపై మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాం. నిందుతులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం’’ అని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతల్లో ఒకరైన నిర్మాత వై.రవి శంకర్‌ అన్నారు.

ఇక ‘పుష్ప’లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్‌ ఫాజిల్‌  విలన్ గా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం తొలిభాగం క్రిస్మస్‌ కానుకగా డిసెంబరులో విడుదల కానుంది.

“సర్కారు వారి పాట”కు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. దీనికి థమన్ సంగీతం అందించారు. కె. వెంకటేశ్ ఎడిటర్ కాగా, ఎఎస్ ప్రకాష్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్.

Follow Us:
Download App:
  • android
  • ios