Asianet News TeluguAsianet News Telugu

అందరు హాలీవుడ్‌కి వెళ్తున్నారు.. నేను మాత్రం సౌత్‌కి వెళ్తాను.. సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలు

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సౌత్ పై తన ప్రేమని వెల్లడించారు. అందరు హాలీవుడ్‌ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, తాను మాత్రం సౌత్‌ సైడ్‌ వస్తానని చెబుతున్నారు.
 

people want to go hollywood but i want to go south salman khan comments arj
Author
First Published Jun 23, 2024, 6:21 PM IST

సల్మాన్‌ ఖాన్‌ బాలీవుడ్‌ కండల వీరుడిగా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌ ఖాన్స్ లో ఒకరు. హిందీ చిత్ర పరిశ్రమని ఏలుతున్న హీరోల్లో ఒకరు. కానీ ఇటీవల ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా వర్క్‌ కావడం లేదు. బ్యాక్‌ టూ బ్యాక డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. స్పై యాక్షన్‌ మూవీస్‌తోనే ఎక్కువగా రావడంతో నార్త్ ఆడియెన్స్ తిరస్కరిస్తున్నారు హిందీలో  చాలా వరకు అలాంటి సినిమాలే రావడంతో వాటిని చూసేందుకు సుముఖత చూపించడం లేదు. 

దీంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ పరాజయాల చవి చూస్తున్నారు సల్మాన్‌ ఖాన్‌. అయితే ఆయన ఇటీవల సౌత్‌ పై ఫోకస్‌ పెట్టారు. చిరంజీవి నటించిన `గాడ్‌ ఫాదర్‌`లో కోమియో రోల్‌లో మెరిశాడు. తెలుగు ఆడియెన్స్ అని అలరించారు. అంతకు ముందు `దబాంగ్‌ 3` ప్రమోషన్స్ కోసం కూడా హైదరాబాద్‌ వచ్చాడు. ఆ మధ్య `కిసి కా భాయ్‌ కిసి కి జాన్‌` చిత్రంలో తెలుగు హీరోలు వెంకటేష్‌, రామ్‌ చరణ్‌లను నటింప చేశారు. సౌత్‌లో పాగా వేసేందుకు ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనిపిస్తుంది. 

ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీపుల్స్(హీరోలు) అందరు ఇప్పుడు హాలీవుడ్‌కి వెళ్లాలనుకుంటున్నారు. తాను మాత్రం సౌత్‌కి వెళ్లాలనుకుంటున్నాను అని వెల్లడించాడు. ఇప్పుడు ఏదైనా(సినిమా) నంబర్స్ మీదనే నడుస్తుంది. కలెక్షన్లే మెయిన్‌ అయ్యాయి. సౌత్‌లో సినిమాలు చూస్తున్నారు, నార్త్ లో చూస్తున్నారు, మనకు చాలా థియేటర్లున్నాయి, ఫ్యాన్స్ ఉన్నారు.  ప్రతి ఒక్కరు ఎదుగుతున్నారు. నెంబర్స్ కూడా చాలా పెరిగిపోయాయి` అంటూ వెల్లడించారు సల్మాన్‌ ఖాన్‌. ఓ సినిమా ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మొత్తంగా సల్మాన్‌ ఖాన్‌ సౌత్‌ ఆడియెన్స్ కి దగ్గర కావాలని, సౌత్‌లో సినిమాలు చేయాలని చూస్తున్నారనే విషయం అర్థమవుతుంది. 

ఇక ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌.. తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ డైరెక్షన్‌లో `సికందర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ కావడం విశేషం. ఇలా సౌత్‌ ఛాయలు ఉండేలా చూసుకుంటున్నారు. దీంతోపాటు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. అట్లీ గతేడాది షారూఖ్‌ ఖాన్‌కి `జవాన్‌` లాంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాన్ని ఇండస్ట్రీకి అందించిన విషయం తెలిసిందే. ఇది సుమారు వెయ్యి కోట్లు వసూలు చేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios