యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమాలో ఇటీవల టైటిల్ సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు విశేష ప్రేక్షకాదరణ లభించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమాలో ఇటీవల టైటిల్ సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు విశేష ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా చిత్రబృందం 'పెనివిటి' అనే మరో పాటను విడుదల చేసింది.
ఈ పాటలో ముందుగా ఎన్టీఆర్ కి తమ బామ్మ ''నువ్ కడుపున పడినాకే నీ అమ్మని గెలిసేసానని అనుకున్నాడో ఏందో.. దాన్ని వంటింట్లో వదిలేసి వరండాలోకి పోయి ఊరిని గెలసడం మొదలుపెట్టాడు'' అంటూ ఎన్టీఆర్ తండ్రి గురించి చెబుతుంటుంది.
పాటకు ముందు వినిపించిన ఈ మాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకే హైలైట్ నిలిచింది. థమన్ అందించిన సంగీతం పాటకి ప్రాణం పోసిందనే చెప్పాలి. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Scroll to load tweet…
